Adsense

Sunday, March 26, 2023

రాగి సూప్ తయారీ - Ragi Soup


రాగి సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.
రాగి పిండి – 3 టేబుల్ స్పూన్స్,
ఉప్పు- త‌గినంత‌,
మిరియాల పొడి – అర‌ టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్,
జీల‌క‌ర్ర – అర టీ స్పూన్,
ఎండు మిర్చి – 2,
చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1
చిన్న‌గా త‌రిగిన క్యారెట్ – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన క్యాబేజి – పావు క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు,
చిన్న‌గా త‌రిగిన బీన్స్ – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – పావు క‌ప్పు,
త‌రిగిన కాలీప్ల‌వ‌ర్ – పావు క‌ప్పు,
నీళ్లు – 4 క‌ప్పులు,
ఉప్పు – త‌గినంత‌,
త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

రాగి సూప్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని తగిన‌న్ని నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నెయ్యిని వేసి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఎండు మిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత త‌రిగిన క్యారెట్, క్యాబేజీ, ప‌చ్చి బ‌ఠాణీ, బీన్స్, క్యాప్సికం, కాలీప్ల‌వ‌ర్ ల‌ని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత 3 క‌ప్పుల నీళ్ల‌ను, మిరియాల పొడిని, త‌గినంత ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ముందుగా ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న రాగి పిండిని వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌రో క‌ప్పు నీళ్ల‌ను పోసి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే రాగి సూప్ త‌యార‌వుతుంది. దీనిని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా అయినా తీసుకోవ‌చ్చు.

No comments: