Adsense

Thursday, March 23, 2023

విప్పపూలు Vippapulu


అతి ముఖ్యమైన చెట్లలో ఇప్పచెట్టు ఒకటి. ఇప్పచెట్టునుంచి ఇప్ప పూలు, మొగ్గలు పూయగానే చెట్ల కింద ఇప్పపూలు రాలుతాయి. ఈ విధంగా రాలిన ఇప్ప పూలన సేకరిస్తారు. పూర్వకాలంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ఇప్ప పువ్వును వేయించి తినేవారు. ఇప్పపువ్వుతో సాంప్రదాయబద్దమైన ఇప్పసారని తయారు చేస్తారు. ఇప్ప గింజలతో ఇప్ప నూనె తీస్తారు. దీనిని వంటనూనెగా ఉపయోగిస్తారు. అనేక ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. దీపాలు వెలిగిస్తారు. దీపారాధనలో వాడుతారు. ఎండిన ఇప్పపువ్వులను కొన్ని పుణ్యక్షేత్రాలలో రామాలయాల్లో రాముడి ప్రసాదంగా పెడతారు. ఇప్ప పువ్వు ఇప్ప బద్ద సేకరించి ఎండబెట్టి అమ్ముతారు.

No comments: