శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయము ...!!
🌿ఈ ఆలయం పొన్నూరు పట్టణము నందు కలదు. పొన్నూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇచట ఎన్నో ప్రాచీన ఆలయాలు కలవు.
🌸వాటిలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయమొకటి. దీనిని పొన్నూరు ఆర్యవైశ్యులు క్రీ.శ. 1899లో నిర్మింపచేశారు.
🌿దేవతలు లోకకల్యాణం కోసం అవతారాలు ఎత్తుతారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఇక్కడి ఆలయంలో మాత్రం ఒక కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది.
🌸మరి ఈ వాసవీ అనే కన్య ఆ అవతారం వెనుక పురాణం ఏంటి ?
ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
🌿 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం నందు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది.
🌸ఈ ప్రాంతంలో ఉన్న ఎన్నో ప్రాచీన ఆలయంలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం పొన్నూరు ఆర్యవైశ్యులచే క్రీ.శ. 1899 లో నిర్మించబడింది.
🌿 ఈ ఆలయ పురాణానికి వస్తే, పచ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో కుసుమ శ్రేష్టి కౌసుంబి అనే వైశ్య దంపతులుండేవారు.
🌸ఆ దంపతులకు వాసవీ అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, సౌదర్యవతి. అయితే ఆమెని విష్ణువర్డనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
🌿ఇదే విషయం ఆమె తల్లితండ్రులకి చెప్పగా వారు, మా కులమువారందరు అంగీకరించినచో ఆమెను తమకిచ్చుట అభ్యంతరము లేదని వారు రాజుకి తెలియచేసారు.
🌸కానీ వైశ్య కులస్థులు ఎవ్వరు అంగీకరించలేదు.
అప్పుడు రాజుకి కోపం వచ్చి తన సైన్యంతో వారందరిపై దండెత్తి వచ్చాడు. రాజుని ఎదురించి పోరాడలేని వైశ్యులు అందరు కుసుమ శ్రేష్ఠితో కలసి అగ్నికి ఆహుతై తమ ప్రాణాలని వదిలారు.
🌿అప్పుడు వాసవీ కన్య తన నిరసనను తెలియచేసి, అగ్నికాహుతైనది. ఆమెయే తరువాత పరమేశ్వరిగా అవతరించింది.
🌸ఈ పరమేశ్వరిని మిగిలిన వైశ్యులు తమ కులదేవతగా భావించి ఆరాధించసాగారు. తరువాత వైశ్యులు అధికంగా ఉన్న ప్రతిచోట ఆమె ఆలయాలు నిర్మించారు. ఈ విధంగా ఏర్పడిన ఆలయాలలో పొన్నూరులో ఏర్పడిన ఈ ఆలయం కూడా ఒకటి.
🌿ఈ ఆలయంలో గర్భగృహమునందు వాసవీ కన్యకా పరమేశ్వరితో పాటు ఈశాన్యదిశ యందు వినాయక విగ్రహం కలదు. ఇలా వెలసిన ఈ ఆలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున గొప్ప ఉత్సవాలు జరుగును..స్వస్తీ... సేకరణ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment