Adsense

Monday, April 3, 2023

మేడారం జాతర




💠 కుంభమేళా, శ్రావణబెళగోళ, పుష్కరాలు ఇలా చెబుతూ సాగితే భక్తి ప్రవృత్తులతో పూజాదికాలు, జాతరల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల నెలవుగా భారతావనికి పెట్టింది పేరు.

💠 ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాది మంది హాజరై వన దేవతలను దర్శించుకుంటారు.

💠 గిరిజనులందరి ఆరాధ్య దేవతలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, కష్టాలు తీర్చే దైవాలుగా వాసికెక్కారు సమ్మక్క, సారలమ్మలు.
తెలంగాణలోనే గాక, భారత దేశంలోని అనేక మంది ప్రజలతో పూజలందుకుంటున్నారు.

🔅 స్థల పురాణం 🔅

💠 పదమూడవ శతాబ్దంలో  ఓరుగల్లు కేంద్రం గా కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలించాడు.
అ సమయం లో కరీనగరం (నేటి కరీంనగర్ )ను మేడరాజు పరిపాలిస్తుండేవాడు.
అయన మేనల్లుడు పాడిగిద్దరాజు మేడారాన్ని పరిపాలించేవాడు రాజ్యం సుభిక్షంగా ఉండేది.

💠 ఒకసారి మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు  అరణ్యంలో చిన్నారి ఆడబిడ్డ ఏడుపులు వినిపించేవి అ బిడ్డ ను ఇంటికి తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టారు.
అ బిడ్డ రాకతో వారి రాజ్యం సుభిక్షం గా ఉండేది అ బిడ్డ యుక్త వయస్సు కు రాగానే పాడిగిద్దరాజు ఇచ్చి వివాహం చేశారు.
వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.
వీరు పెరిగి పెద్దవారు అవుతున్న సమయంలో కాకతీయ సామ్రాజ్యంలో తీవ్ర కరువు దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి.

💠 కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టవలసిందిగా పాడిగిద్దరాజును ఆదేశించాడు,  కప్పం కట్టనని తెలిపి తనకు తాను స్వాత్రంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు.
రాజద్రోహంగా పరిగణించిన ప్రతాపరుద్రుడు విశారదుని ఆధ్వర్యంలో మేడారం పైకి సైన్యం ను పంపాడు.
విషయం తెలుసుకున్న పాడిగిద్దరాజు తన కుమారుడు జంపన్న, కుమార్తె నాగులమ్మ అల్లుడు గోవిందరాజు లను కాకతీయ సైన్యం ను ఎదుర్కోవాలని పంపాడు .

💠 ఈ భీకర యుద్ధంలో అందరు మరణించారు.
కొనఊపిరితో ఉన్న జంపన్న సంపెంగ వాగు దాటుచు అ వాగులో కన్ను మూసాడు .
అయన రక్తం తో ఎరుపు రంగు సంచారించుకున్న సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క తన కుమార్తె ను తీసుకొని యుద్ధరంగానికి వెళ్లి ఆదిశక్తి గా విజృభించింది. విజయం వరించే సమయంలో దొంగ చాటుగా కాకతీయ వీరుడు బల్లెంతో ఆమె వీపున పొడిచాడు వెంటనే గుర్రాన్ని తీసుకొని చిలకల గుట్ట వైపు వెళ్లి అదృశ్యం అయింది.
కోయ సైన్యానికి చివరగా ఒక నెమలినార వృక్షం క్రింద ఒక భరిణె లో పసుపు -కుంకుమ కనిపించింది .

💠 తిరిగి యుద్ధ రంగానికి వచ్చిన సైన్యనికి సారలమ్మ కాకతీయ సైన్యం తో వోరోచితంగా పొరాడి అమరురాలు అయింది.
వీరి ఇద్దరి మరణాలకు గుర్తుగా  అక్కడ రెండు కర్ర స్థంభం లను పాతారు తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు పాతినా వాటిని దేవతలుగా పూజిస్తూ జాతర చేయడం ప్రారంబించాడు.
అప్పటి నుండి కాకతీయ వడియరాజులు ప్రాయాచిత్తంగా ఆలయ పూజారులుగా పూజిస్తూ ఉంటున్నారు.

💠 యుద్ధభూమిలో వీరవనితల
త్యాగఫలానికి సంస్కరణగా జరుపుకునే ఈ వేడుకే, మేడారం జాతరగా మారింది.

💠 ఇప్పటికీ, జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్న వాగులో పవిత్ర స్నానమాచరించాకే దేవతలు దర్శించుకోవడం కట్టుబాటుగా మారింది.

💠 కాకతీయ సేనలతో వీరోచితంగా పోరాడిన మన్యం వీరవనితలు సమ్మక్కసారలమ్మల రక్తం చెందిన చోటనే ప్రతిష్టించిన గద్దెలకు ఆ వనదేవతలు మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజు తరలిరావడం, మరుసటి రోజు గురువారం గద్దెలపై కొలువు దీరడం, శుక్రవారం తిరిగి వనదేవతల వనప్రవేశంతో మూడు రోజుల జాతర ముగుస్తుంది.
అయితే ఈ జాతర కోసం, వందలాది మైళ్ల దూరం నుంచి ఎడ్లబండ్లలో 15 రోజుల ముందే గిరిజన తెగలు, ఇతర నిరుపేదలు బయలుదేరి దండకారణ్యంలో విడిది చేస్తూ, మార్గమధ్యంలోని ఊరి దేవతలను దర్శించుకుని, వేములవాడకు చేరుకుని రాజన్నను దర్శించుకుంటారు.

💠 ఆ తరువాత మేడారం దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వేల సంఖ్యలో ఎడ్ల బండ్లు దండకారణ్యంలో చీమలబారుల్లా మేడారం తరలివచ్చే ఆ దృశ్యాలు ఐదు ఆరు దశాబ్దాల క్రితం నాటి పల్లె ప్రజల జీవన మనోచిత్రాన్ని కళ్ళారా చూడాల్సిందే. ఇక గద్దెలకు సమ్మక్కసారలమ్మల ఆగమనవేళ, దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది మంది భక్తిపారవశ్యంతో మొక్కులు చెల్లించేందుకు ఎదురు వెళ్లి, కోడి పుంజులను బలి ఇచ్చే ఎదురుకోళ్లు, శివసత్తుల పూనకాలు, గిరిజనసంప్రదాయ వాద్యాలు, మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో ఏదో తెలియని అద్వితీయ అనుభూతికి గురి చేస్తుంది.

💠 తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు.
ఇక్కడ బెల్లంను బంగారంగా వ్యవహరిస్తారు.

💠 గిరిజనలే కాకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ జాతర మహోత్సవంలో పాల్గొంటారు.

No comments: