తదియ చంద్రుని పూజ...!!
🌿పరమశివుడు తన జటాఝూటంలో
చంద్రకళని ధరించినందున
చంద్రశేఖరుడని పిలువబడుతున్నాడు.
🌸పరమేశ్వరుడు ప్రధమంగా చంద్రుని తన శిరసున ధరించిన ఆలయం తంజావూరు జిల్లాలోని మహిమాలై అని చంద్రమౌళీశ్వరుని ఆలయ చరిత్ర
తెలుపుతున్నది.
🌿జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుని స్ధానం అనేది ముఖ్య అంశం. భూలోకంలో చంద్రుని స్ధానంగా చెప్పబడే ప్రాంతం మహిమాలై.
🌸మహిమాలై తదియ చంద్రుని దర్శించడం పరమేశ్వరుని ప్రత్యక్షంగా దర్శించినట్లే అని అంటారు. ఈ ఆలయానికి సమీపమున
సూర్యస్ధానం అయిన సురైక్కాయూరు
వుండడం విశేషం
🌿ఒకసారి పార్వతీదేవి కైలాసంలోని
పరమశివుని నేత్రాలను
సరదాగా మూసింది. తక్షణమే ముల్లాకాలలో అంధకారం అలుముకుంది. పంచభూతాలు, ప్రాణి కోటి స్థంభించింది.
🌸ఈ ఆకస్మిక విపరీత పరిణామాలు చూసి పార్వతీ దేవి విస్మయం చెంది తన పతి ముఖం మీదనుండి తన చేతులను తీసేసింది.
తక్షణమే సకలజగత్తు యదాస్థితికి వచ్చి చైతన్యం పొందింది.
🌿సర్వకాల స్థితి గతులకు పరమేశ్వరుడే మూలాధారమని
యీ సంఘటన
విశదపరుస్తున్నది.
🌸ఈవిధంగా లోకమంతా అంధకారబంధురం కావడానికి తనే కారణమని భావించిన
అంబిక ఈశ్వరుని పూజించడానికి భూలోకానికి వచ్చినది.
🌿పార్వతీదేవి మానవ స్త్రీ రూపంలో ఒక ప్రాంతంలోని భక్తులందరిని చేరదీసి అన్నపూర్ణాదేవి వలె
వారి ఆకలి బాధను తీరుస్తూ కాపాడుతూ వచ్చింది.
🌸తన మూలంగా ఈ లోకం తిరిగి చీకటిమయమై ప్రకృతి అస్తవ్యస్తం కాకుండా వుండడం కోసం ఈశ్వరుని వరం కోరాలని సంకల్పించినది పార్వతీదేవి.
🌸ఒక మెట్ట మీద తపస్సు చేస్తూవున్న అగస్త్య మహర్షిని చూసింది. ఆ ప్రాంతమే మహిమాలై చంద్రమేడు.
జరిగిన విషయం అంతా మహర్షికి తెలియజేసింది.
🌿 పార్వతి చెప్పినది విని అగస్త్య మహర్షి ఆశ్చర్యంతో " ప్రపంచం
అంధకారమైనదా..నాకు తెలియదు" అని అన్నాడు. లోకమంతా అనుభవించిన ఆ దుర్భర స్థితి అగస్త్య మునికి ఎందుకు కలగలేదనే సందేహం పార్వతీదేవి కి వచ్చింది.
🌸పరికించి చూడగా అగస్త్య మహర్షి సన్నిధిలో చంద్రస్ధానమున
తదియ చంద్రుని ధరించిన తేజోమయ
స్వయంభూ శివలింగం దర్శనమిచ్చినది.
🌿అగస్త్య మహర్షి పార్వతీదేవి సందేహం తీరేలా " తల్లీ! పరమశివుడు ఇచట తన శిరసున ప్రకాశవంతమైన తదియ చంద్రుని ధరించి దర్శనమిస్తున్నాడు. ఇకపై ఎప్పుడూ లోకాన్ని అంధకారం చుట్టముట్టదు." అని అన్నాడు.
🌸అప్పుడు అగస్త్య మహర్షి సంచరిస్తున్న ప్రాంతాలలోని ప్రజలంతా వచ్చి మహేశ్వరుని స్వయంభూ లింగాన్ని భక్తి శ్రధ్ధలతో పూజించారు. పార్వతీదేవి వారందరికి భోజనాలు స్వయంగా ప్రసాదించినది.
🌿కాలక్రమేణా అక్కడ
ఒక ఆలయం నిర్మించబడినది.
ఆలయప్రవేశ ద్వారం పై పార్వతి పరమేశ్వరులు కైలాసంలో ఆశీనులైన భంగిమలో సున్నపురాతి విగ్రహాలు దర్శనమిస్తాయి.
🌸మహామండపంలో నందికేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ మండపం వెలుపల
ఎడమప్రక్కగా వినాయకుడు కుడిప్రక్కగా కుమారస్వామి దర్శనమిస్తున్నారు.
కుమారస్వామి సమీపమున అయ్యప్పన్ దర్శనమిస్తున్నాడు.
🌿ఆ మండపం దాటాక గర్భగుడిలో పరమేశ్వరుడు చంద్రమౌళిగా, స్వయంభూమూర్తిగా
ప్రజలను కాపాడుతున్నాడు.ఈ స్వామిని ప్రార్ధిస్తే వారి వారి జాతకాలలోని చంద్ర దోషాలు నివృత్తి అవుతాయి.
🌸ఆ మండపానికి సమీపమున కొలువై వున్నది ప్రపంచానికే అన్నం ప్రసాదించే అన్నపూర్ణాదేవి.
మరొక ఆవరణలో దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు.
🌿సంవత్సరం పొడుగునా ఈ ఆలయంలో 🌿ఏవో ఉత్సవాలు జరుగుతూ వుంటాయి.
ఈ ఆలయం తదియ చంద్రుని దర్శనానికి పేరు పొందినది. ఈ తదియ చంద్రుని దర్శనంతో
గత జన్మలోని పాపాలు తొలగిపోతాయి.
🌸స్తీలకి మాంగల్యబలం సిధ్ధిస్తుంది.
మానసిక వ్యాధులు మాయమౌతాయి. జ్ఞాపకశక్తి వృధ్ధి చెందుతుంది.
కంటిచూపు మెరుగుపడుతుంది. ఐశ్వర్యం వృధ్ధి చెందుతుంది. బ్రహ్మ హత్యా పాపం తొలగిపోతుంది.
🌿తదియతిధి కలసిన శనివారం రోజున చంద్రుని దర్శనం సంవత్సరం అంతా చంద్రుని దర్శించినంత పుణ్యప్రదం.
🌸తదియచంద్రుని మూడు సార్లు
దర్శిస్తే ఎటువంటి మూఢుడైనా తెలివైనవాడు
అవుతాడని అంటారు.
🌿నాలుగసార్లు వరుసగా తదియ చంద్రుని దర్శించిన పాపాలు నశిస్తాయి.
ఐదు సార్లు వరుసగా తదియ చంద్రుని దర్శించిన పేదవాడు కోటీశ్వరుడవుతాడు.
🌸వరుసగా ఆరుసార్లు తదియ చంద్రుని దర్శించిన ఎటువంటి అడ్డంకులు లేకుండా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
🌸ఎల్లప్పుడూ తదియ చంద్రుని దర్శిస్తూనే వుండేవారికి తరగని సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఐహీకం.
తంజావూరు జిల్లాలోని అమ్మపేట్టై నుండి కుంభకోణం వెళ్ళే మార్గంలో 5 కి.మీదూరాన మహిమాలై క్షేత్రం వున్నది...స్వస్తి..
No comments:
Post a Comment