Adsense

Sunday, April 30, 2023

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ....సందర్భంగా అమ్మ గురించి కొన్ని విషయాలు..!!

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ....సందర్భంగా  అమ్మ గురించి కొన్ని విషయాలు..!!



🌿గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్రస్థలి. అక్కడికి సమీపంలోని పెనుగొండ కన్యకా పరమేశ్వరీ జన్మస్థలం.

🌸సుమారు వేయేళ్లక్రిందట వేంగీ చాళుక్యుల కాలంలో జరిగిన పెను తిరుగుబాటుకు వేదిక పెనుగొండ.

🌸ఆనాడు మాఘ శుద్ధ విదియ. గోదావరి ఒడ్డున నగరేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలో 103 అగ్ని కుండాలు మహోజ్వలంగా వెలుగుతున్నాయి.

🌿 పెనుగొండ నగరమంతా ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ఎదుటివారి అభిప్రాయానికి విలువనివ్వకుండా ఇష్టారాజ్యం సాగించుకోవాలనుకునే అధికార దర్పానికి చరమ గీతం పాడే త్యాగపతాక లాంటి సందర్భం అది.

🌸 జీవితాంతం కన్యగానే ఉండాలనుకున్న కన్యక అభీష్టానికి వ్యతిరేకంగా విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు.

🌿ఒప్పుకోకపోవడంతో పెనుగొండపై యుద్ధం ప్రకటించాడు. తనవల్ల రాజ్యంలో సంక్షోభం రేగడం కన్యకను బాధించింది.

🌸 ఆత్మత్యాగం చేసుకోవాలనుకుంది. ఆమెకు మద్దతుగా 102 గోత్రాల వైశ్యప్రముఖులు కూడా ఆనాడు ఆత్మబలిదానానికి సిద్ధపడ్డారు.

🌿 బలిదానానికి ముందుగా కన్యక విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్యమహాదేవిగా తనను ప్రకటించుకుంది.

🌸 గత జన్మలో దేవీ ఆరాధన విశేషంగా చేసిన సమాధి అనే వైశ్యశ్రేష్ఠుడే నేటి జన్మలో కుసుమ శ్రేష్ఠిగా, తన తండ్రిగా జన్మించాడని చెప్పింది.

🌿తపోఫలితంగా తనతో పాటు 102 గోత్రాలవారికి మోక్షాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నందువల్ల ఈ జన్మ వచ్చిందని తెలియచేసింది.

🌸దేశభక్తి, సమాజసేవ, నిజాయితీల ప్రాధాన్యాన్ని ప్రబోధించింది. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదినం వైశాఖశుద్ధ దశమి కాగా, ఆమె ఆత్మార్పణ దినం మాఘశుద్ధ విదియ.

🌿 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో రాజరాజనరేంద్రుడు నిర్మించిన వాసవీ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది.

🌸నగరేశ్వరస్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణ చేసిన చోట కన్యకాంబ ఆలయం ఉంది..

No comments: