Adsense

Sunday, April 2, 2023

దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా ఎందుకు ఉంటారు?

అసలు మన దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడం ఎందుకు ...??


🌿అసలు మన దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడం వెనుక వారి చేతుల్లో రకరకాల  పుష్పాలు, ముద్రలు ఉండడం వెనుక చాలా అర్ధం అంతరార్ధం ఉన్నాయి.

🌸అర్చామూర్తులు కొందరు జ్ఞానులకు ఋషులకు ఆ రూపంలో దర్శనం అనుగ్రహించగా లేదా వారిని ఆ రూపంలో రక్షించగా వారు దయతో మనకోసం ఆ రూపాన్ని వర్ణించి చూపారు.

🌿మరికొన్ని చోట్ల ఆ దేవతామూర్తులే స్వయంగా వ్యక్తమయ్యారు ఆ రూపాలలో. వారి వివిధ భంగిమలకు, వారి చేతి ముద్రలకు  ఎన్నో అర్ధాలు చెబుతారు పండితులు.

🌸1. వారి అరచేయి ఆశీర్వాదం ఇస్తున్నట్టు
కిందకు చూపుతూ ఉంటె నిన్ను నేను కాపాడుతాను రా అని అభయం ఇస్తున్నట్టు

🌿2. వారి చేయి పూర్తిగా విప్పారి ఆశీర్వదిస్తున్నట్టు ఉంటె నీకు భయం లేదురా  నిన్ను నేను చూసుకుంటా,
ఏమాత్రం భయ పడవలదు అని చెప్పినట్టు

🌸3. చిన్ముద్రలో ఉంటె నిన్ను అజ్ఞానం నుండి తీసి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను అని
అభయం ఇచ్చినట్టు

🌿4. ఒక కాలు ఎత్తి నించున్న భంగిమ నిన్ను  ఈ సంసార సాగరాన్ని దాటించి ముక్తిని ఇస్తాను అని చెప్పినట్టు

🌸5. అమ్మవారిలా రెండు చేతులో వారి హృదయానికి దగ్గరగా ఉంచితే నిన్ను అక్కున చేర్చుకుని నీకు జ్ఞానమిచ్చి నిన్ను ధర్మం వైపు నడిపించి నిన్ను చూసుకుంటాను అని ప్రేమతో చెప్పినట్టు

🌿6. తిరుమలలో ఉన్నట్టు స్వామి వారు కటిహస్తం ఉంచితే ఒరేయ్ ఈ సంసారమనే సాగరం నీ కటి వరకే వస్తుంది, నా పాదాలను నమ్ముకుని నేను చెప్పినట్టు ఉన్నవాడిని ఇలా నడిపించి ఈ భవసాగరాన్ని దాటిస్తాను అని చెప్పినట్టు

🌸ఇలా ఎన్నో భంగిమలకు, వారి అభయ హస్తాలకు ఎన్నో అర్ధాలు గోచరిస్తాయి, అన్నింటిలో కూడా భక్తుని రక్షించే ఆర్తత్రాణపరాయణత్వం కనబడుతూ ఉంటుంది.

🌹
మూర్తులు ప్రధానంగా 3 రకాల రూపాలలో అనుగ్రహిస్తూ కనబడతారు.💐

🌿
1. శాంతం.

🌸ప్రశాంత వదనంతో ద్విభుజులుగా లేక చతుర్భుజులుగా దర్శనం ఇస్తూ ఉంటారు

🌿2.
వీరం..

🌸రెండు కానీ నాలుగు కానీ ఆరు భుజాలతో వీర రసం ఒలికిస్తూ దుష్టశిక్షణ, శిష్ట రక్షణను నిర్దేశిస్తూ కనిపించే విగ్రహాలు

🌸3. ఉగ్రం..!!

🌿ఆరు కానీ, 8 కానీ 18 కానీ భుజాలతో ఉగ్రమూర్తులు. దుష్టశిక్షణ ప్రధానంగా కనిపించే
ఈ అర్చామూర్తులు పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.

🌸 మనకు ఎక్కువగా చతుర్భుజులుగా ఉన్న అర్చామూర్తులు దర్శనం ఇస్తూ ఉంటారు.
ఆ నాలుగు భుజాలు ఉండడానికి కూడా ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

🌿ఆ నాలుగు చేతులు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి.

🌸1. నీకున్న నాలుగు దిక్కులలో నిన్ను రక్షించే  తత్త్వం నాది

🌿2. జాగ్రద్, స్వప్న, సుషుప్త, తురీయావస్థలలో నిన్ను వెన్నంటి ఉన్న తత్త్వం నాది

🌸3. చాతుర్వర్ణం నా సృష్టి. అందరినీ రక్షించే  బాధ్యత నాది.

🌿4. నీకున్న నాలుగు ఆశ్రమాలలో నిన్ను కనిపెట్టి ఉంటాను

🌸5. మనస్సు, బుద్ధి అహంకార చిత్ అవస్థలలో నిన్ను చూస్తూ ఉన్నాను

🌿6. ధర్మార్ధకామ మోక్షాలు అనే నాలుగు పురుషార్ధాలు ప్రసాదించేది నేనే

🌸7. ఆహవనీయ, గార్హపత్య అనే నాలుగు అగ్నులు నా ఆధీనం

🌿8. నాలుగు మార్గాలు నన్ను చేరేవి
ఇలా ఎన్నో తత్త్వాలు👍 చెబుతాయి...స్వస్తి.

No comments: