Adsense

Sunday, May 28, 2023

నాగనాథ స్వామి ఆలయం, తిరునగేశ్వరం

నాగనాథ స్వామి ఆలయం, తిరునగేశ్వరం

రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల సరస్వతి, లక్ష్మీదేవి ఉన్నారు. ఈ ఆలయంలో తన ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లి లతో కూడిన రాహు భగవానుని సందర్శకులు చూడవచ్చు. రాహువు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడు. ఇతర దేవాలయాలలో రాహువు సర్పముఖాన్ని కల్గి ఉండి నాగనాధ్ స్వామి ఆలయంలో మానవ ముఖాన్ని కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

ఈ ఆలయంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది.

ఈ ఆలయంలో దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది. క్షీరాభిషేకం సమయంలో రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య లక్షణ౦

మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్ కు అందని వింతలూ శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహు ఆలయం. ఈ ఆలయంలో నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో పాలు పోస్ట్.. నీలి రంగులోకి మారి.. కిందకు జారిపడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయి.. నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ప్రసిద్దిగాంచినది ఈ ఆలయం
ఈ ఆలయంలో ప్రధానంగా పూజలను అందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో నాగరాజు రావుతో మండపంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉన్నాడు. ఈ గుడికి రాహు , నాగ దోషం ఉన్నవారు విశేష పూజలను నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే ‘ రాహుకాలం ‘ లో పాలాభిషేకం చెయ్యడం. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన తమకు ఉన్న ‘ రాహుగ్రహ ‘ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇలా రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు.

ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం. నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట.

ఆలయానికి ఎలా వెళ్లంటే:

మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి. హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16గంపడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజుపడుతుంది.

No comments: