హనుమంతునకు అపూపములు అంటే అప్పములు చాలా ఇష్టము. బియ్యపుపిండితో, బెల్లముతో కల్పి వండెడి అప్పములు నివేదించుటకే కాక హనుమత్రీత్యర్థం వాయనదానమునకును ముఖ్యములు. హనుమద్ర్వతమున అపూపదానము కర్తవ్యము.
వడలు అనగా గారెలు నివేదించుట ఇష్టము. అంతేకాక వడమాల ధరింపజేయుట, ఆ గారెల దండను ప్రసాదంగా స్వీకరించుటయు కలదు. హనుమంతునకు లడ్లు ఇష్టము. పాయసాన్నము, చిత్రాన్నము అనగా పులిహోర స్వామికి నివేదింపదగినవి. పంచదార కలిపిన గోధుమరవ్వ యిష్టమయినది. హనుమద్ర్వత విధానమున ఐదు కథలందు దీనిని నివేదించి ప్రసాద వితరణము జరపాలి. కజ్జాయము అనగా కొబ్బరి కోరిన దానికి పంచదార కల్పి నివేదించుట యిష్టము.
భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాదుల తోడి మహా నివేదనము మడితో చేసినవానిని మాత్రమే నివేదింపవలెను. ముందు నివేదన పెట్టిన చిప్పలు కోరి పంచదారతో మరల నివేదించుట తగదు. ఎండు కొబ్బరితో నయినా చేయవచ్చును. బజారు పిండివంటలు నివేదించుట తగదు. అశుచిగా మడిలేకుండా వంటలు, పిండివంటలు నివేదించుట కంటె ఫలసమర్పణము శ్రేయస్కరము.
No comments:
Post a Comment