Adsense

Thursday, May 11, 2023

వినాయకుడు



శుక్లంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతియే.

ఈ శ్లోకంలో ఆ దేవుని పేరు రాయబడలేదు. కాని ఆయన లక్షణాలు రాయబడ్డాయి. లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వెదకాల్సిన బాధ్యత మనదే...

ఈ శ్లోకాన్ని గూర్చి చాలా వాదనలు, విశ్లేషణలు ఉన్నాయి. ఈ శ్లోకం విష్ణుమూర్తి కోసమని కొందరు, గణేషుడి కోసమని కొందరు, విశ్వక్సేనుని గూర్చి అని ఇంకొందరు, హయగ్రీవుని గూర్చి అని మరికొందరు వాదిస్తుంటారు. ఇలా వాదించేవారెవరూ ఈ శ్లోకంలోని లక్షణాలను పరిగణలోనికి తీసుకోకపోవడం విచారకరం. మనమైతే ఇప్పుడు ఈ శ్లోకం చూపే దైవమెవరో పరిశీలిద్దాం...

ఈ శ్లోకం మనం ధ్యానించాల్సిన వాని యొక్క 5 లక్షణాలను చూపుతుంది.

1. శుక్లం బరదరం: శుక్లం అనగా తెల్లని. బర అనగా వస్త్రాలు. ధర అనగా ధరించువాడు. ఏ దేవుడైతే తెల్లని వస్త్రాలు ధరిస్తాడో ఆయనే మనం ధ్యానించాల్సినవాడు. ఆయన ఎవరు..?

2. విష్ణుం: అనగా ప్రతీ చోట ఉండువాడు.. ఏ దేవుడైతే ప్రాంతము, భాష అనే బేధం లేకుండా అన్ని చోట్లా, అందరిలోనూ ఉంటాడో ఆయనే మనం ధ్యానించాల్సినవాడు... ఆయన ఎవరు.?

3. శశివర్ణం: అనగా చల్లనివాడు లేక కోపంలేనివాడు.. ఏ దేవుడైతే శాంత స్వభావుడో, దేవునిలో అయితే కోపోద్రేకాలు లేవో ఆయనే మనము ధ్యానించాల్సినవాడు. ఆయన ఎవరు?

4. చతుర్భుజం భుజం అనగా బాధ్యత. చతుర్భుజం అనగా అతడు నాలుగు బాధ్యతలు నెరవేర్చగలవాడై యుండాలి. అనగా మానవ జీవితపు పుట్టుక, జీవనం, మరణం, మరణానంతర జీవితాలను ఆయనొక్కడే నడిపించువానిగా ఉంటాడు. ఎవరాయన?

5. ప్రసన్నవదనం: అనగా కృపగల ముఖముగలవాడు. అంటే మానవులు పాపము చేసి క్షమాపణ అడిగినప్పుడు వారి తప్పిదాలకు బదులుగా మరేదో అడగకుండా ఉచితంగా వారిని క్షమించువాడు. ఎవరా దయగలవాడు?

ఈ 5 లక్షణాలు గలవాడు మాత్రమే మానవులకి వచ్చే సర్వ విఘ్నాలకు శాంతికరమవుతాడు. వాటికి పరిష్కారం అవుతాడు.

No comments: