చంద్రుని రథం గురించిన వివరాలివి...!!
🌿సూర్యునికి ఉన్నట్లే, చంద్రునికి కూడ గొప్ప ప్రకాశమానమైన ప్రామాణికమయిన రథం ఉంది. మూడు చక్రాలతో - ఉదకగర్భం నూంచి పుట్టిన మల్లెమొగ్గల్లా తెల్లని గుర్రాలను పూంచినరథం చంద్రునిది.
🌸ఈ రథంనకు ఇవి రెండువైపులా చెరో ఐదు ఉన్నాయి. ధ్రువుడీ చంద్రరథాన్ని కూడా అదుపుచేస్తూ, మండలాకారంలో నక్షత్రవీధిలో సంచరింప జేస్తున్నాడు. ఇవి ఇట్లే కల్పాంతం వరకు ఉంటాయి.
🌿సూర్యకిరణాలలాగానే, చంద్రకిరణాలకూ తరుగుదల - పెరుగుదల లున్నాయి. దేవతలచేత పానం చేయబడి క్షీణదశ పొందిన చంద్రబింబాన్ని దీప్తిమంతుడై రవి తృప్తిపరుస్తాడు.
🌸అమావాస్య రోజున 15వ చంద్రకళ పితృదేవతల చేత పానము చేయబడుతుంది.
🌿కృష్ణపక్షంలో ఏ తిథిలో ఎంత త్రాగబడిందో, అంతపుష్ఠి శుక్లపక్షంలో భాస్కరుడు అందజేస్తాడు.
🌸పదిహేను రోజులపాటు ఊండే శుక్లపక్షంలో రోజురోజుకూ చండ్రుడు, సూర్యునినూంచి కాంతిని (పుష్ఠిని) పొందగా, అలా ప్రోగుపడినట్టి 'సుధా' రసమును (చంద్రబింబంలోని అమృతాన్ని) దేవతలు పానం చేస్తూ వుంటారు.
🌿అందువల్లనే అమరులు సుధాహారులు. (సుధకు వెన్నెలలోని అమృతం అని పేరు) ఈ ప్రకారం 33,333 మంది దేవతలు, చంద్రునిలోని అమృతాన్ని పానం చేస్తారు.
🌸అప్పుడు కేవలం రెండుకళలచేత మాత్రం మిగిలి, సూర్యమండలాన ప్రవేశించి 'అమా' అనే కిరణంలో వసించుట చేత కృష్ణపక్షపు 15వ తిథి 'అమావాస్య' అనే పేరు వచ్చింది.
🌿ఆరోజున చంద్రుడు అహోరాత్రాలు నీటిలో వసిస్తాడు. తరువాత తరువులు - లతల లోనికి ప్రవేశిస్తాడు. (చెట్లు - ఔషధమొక్కలలోనికి కూడ) తదుపరి సూర్యునిలోనికి ప్రవేశిస్తాడు.
🌸కనుక అమావాస్య తిథియందు చెట్ల ఆకులను త్రుంచకుడదు. అది బ్రహ్మహత్యా పాతకంతో సమానం. ఈరోజున అపరాహ్ణసమయంలో సౌమ్యులు, బర్హషదులు, అగ్నిష్వాతులు అనే నాలుడుప్రధాన భాగాలనే ముడురకాల పితృదేవతలు చంద్రునిలో మిగిలిఉన్న కళను త్రాగేస్తారు.
🌿ఈ ప్రకారం దేవతల్ని, పితృదేవతల్ని, ఔషధులని పెంపొందించిన కారణంగావ్ మనుజుల్ని తృప్తి చెందిస్తాడు
🌸సూర్యుడు- సూర్య భగవానుడు
తూర్పువైపు తిరిగి ఉండే నవగ్రహాలలో సూర్యుడు మధ్య స్థానంలో ఉంటాడు. రవి అని కూడా పిలవబడే సూర్యుడు సింహరాశికి అధిదేవుడు. సూర్యుడి వాహనం ఏడు గుర్రాలు నడిపే రథం. ఈ ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని రంగులు (తెల్లటి కాంతిలోని ఏడురంగులు) మరియు వారంలో ఏడురోజులకు ప్రతీక.
🌿చంద్రుని పుత్రుడు బుధుడు. ఇతని రథం పింగళ వర్ణంలో ఉంటుంది. వాయువేగం గల 8 గుర్రాలు కలిగినది. వాయువు - అగ్ని అనే ద్రవ్యాలతో కూడినది.
🌸 భూమ్మీద జనీంచిన గుర్రాలను పూంచినట్టిది - వరూధము, కర్షము, పతాకము, ఉపాసంగము అనే నాలుగు ప్రధాన భాగాలు కలిగినట్టి రథం శుక్రునిది.
🌿కుజునిది బంగారు రథం. ఎనిమిది పద్మరాగమణులలాగ ఎర్రని గుర్రాలతో శోభాయమానమైనది. ఈ గుర్రాలు అగ్ని ద్వారా జనించాయి.
🌸బృహస్పతి రథానికి ఎనిమిది గుర్రాలున్నాయి. అయితే ఇవి లేతబంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రథం మీద బృహస్పతి ప్రతిరాశిలోను ఒక్కొక్క సంవత్సరం నివశిస్తాడుl.
🌿శనైశ్చరుని రథం మందగమనం కలది. ఇది శబలవర్ణ గుర్రాలున్న రథం. రాహువు రథం బూడిద వర్ణమ్లో ఉండి, తుమ్మెద రెక్కల్ని పోలిన నలుపురంగు గురాలను పూంచినట్టిది. గ్రహణసమయాలలో మాత్రం తన ఉనికి చాటుతాయి
🌸కేతుగ్రహానిది పొగరంగు రథం. ఈతడి రధాశ్వాలు ఎర్రని రంగులో ఉంటాయి. (లక్కరంగు అని కోందరు)
🌿ఈ తొమ్మిదీ గ్రహ రథాలు. ఇవన్నీ వాయురూపమ్లో ఉండే కట్టుత్రాళ్లతో ధ్రువుని ఆధీనంలో ఉంటాయి. ఇవేకాక నక్షత్రాల - గ్రహాల - సమస్త జ్యోతిర్మండలం పగ్గాలు ధ్రువుని అదుపులో ఉంటాయి.
🌸ఇవి 'ప్రవహము' అనే వాయువు చేత ప్రేరేపించబడి, తాము చలిస్తూ, గానుగను త్రిప్పేరీతిగా ధ్రువుని కూడ చలీంపజేస్తున్నాయి. ధ్రువస్థానానికి మొసలి రూపుధరించిన శ్రీమహావిష్ణువే, (శింశుమారుడు) సహాయకారిగా ఉండి ఈ చారణవిధినంతటినీ ఒక క్రమంలో జరిగేలా చూస్తాడు
🌿ఈ శింశుమార చక్రాన్ని ఏ మనుజుడు దర్శించగలడో, అట్టిమానవుని పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ శింశుమార చక్రాన్ని అనుసరించి ఎన్ని తారకలుంటే, అన్ని ఏళ్లు దీన్ని దర్శించేవారు జీవిస్తారు.
🌸శింశుమార స్వరూపంలో - ధర్మౌ శిరస్సు. ఒక దౌడ ఉత్తానపాదుడు, రెండో దౌడ యజ్ఞం. హృదయంలో నారాయణుడు. అశ్వినీ దేవతలు పాదాలు, వరుణుడు, సూర్యుడు ఊరుభాగము. మిత్రుడు అపానమార్గం, సంవత్సరం శిశ్నభాగాన్ని ఆశ్రయించి ఉన్నారు.
🌿హతోకను ధ్రువుడు - అగ్ని - కాశ్యపుడు - మహేంద్రుడు ఉన్నారు. ఈ నలుగురూ ఎన్నడూ అస్తమించరు...స్వస్తీ..సేకరణ..
No comments:
Post a Comment