Adsense

Friday, May 26, 2023

నాందీశ్రాద్ధము

నాందీశ్రాద్ధము 

ప్రతియొక్క మంగళకార్య ప్రారంభములో విఘ్ననివారణ కోసం వినాయకుని పూజ చేయునట్లే పితృల మరియు పితృదేవతల  నాందీశ్రాద్ధమును చేయుదురు.

సామాన్యముగా నాంది శ్రాద్ధమందు (వృద్దిశ్రాద్ధములో) దర్భలను ఉపయోగించక దూర్వలను(గరిక) ఉపయోగింతురు. అయితే నాంది శ్రాద్ధము యజ్ఞాల యొక్క కర్మాంగమయినచో, వేర్లు లేని అనగా భూమిపైన దర్భలను మరియు దూర్వలు మరియు దర్భలను చేర్చి ఉపయోగింతురు.

ఏ ఒక్క దేవుని పూజ చేయవలసి యుండునో ఆ దేవుని పవిత్రకములను ఆకర్షించు క్షమత వుండు వస్తువులను ఆ దేవుని పూజలో ఉపయోగింతురు.

గంధాది పంచోపచారము
(గ్రంధము, అక్షంతలు, పువ్వలు, ధూపము మరియు దీపము) పూజ చేసి దక్షణను పాత్రలో విడవవలెను, మరియు ఒక పైసను దక్షిణ దిక్కుకు మరియు ఒక పైసను ఉత్తర దిక్కుకు పారవేయవలెను. దక్షిణ దిక్కుల్లో పారవేసిన పైసను పితృలోకములో ఉండు పితృలు మరియు ఆ దిక్కు నుండి వచ్చు కష్టహరమైన శక్తులకు వారు కష్టములను ఇవ్వకూడదనుట కోసము అర్పించటమగును. ఉత్తర దిక్కున పారవేసిన పైసను శుభకరమైన దేవతలకు ఆర్పించడమగును.

No comments: