Adsense

Monday, May 8, 2023

కొబ్బరి కారం

కొబ్బరి కారం

కావలసినవి: పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది; ఎండు మిర్చి: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగపప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె: తగినంత.

తయారి: పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత కొబ్బరి తురుమును వేయించాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు. ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్‌.

No comments: