Adsense

Friday, May 26, 2023

శ్రీ శివపంచాక్షరి

శ్రీ శివపంచాక్షరి


అష్టాదశవిద్యలలో వేదము శ్రేష్ఠమైనది. వేదమునందు రుద్రాధ్యాయము నుత్తమము. రుద్రాధ్యాయమున శివపంచాక్షరీ మహా మంత్రము గణనీయమైనది. శివపంచాక్షరియందు శివనామము మహత్తరమగునది.

వేదపురుషునకు హారములో నాయకమణివలె విరాజిల్లు శివ శబ్దముతో సంఘటితమైన శివపంచాక్షరీ మహామంత్రమును ప్రణవార్ధముగాను స్థూలప్రణవముగాను పరమేశ్వరుడు బోధించెను. ఇతర మంత్ర అల్పార్థము గలవిగాను బహ్వక్షరములు గలవిగాను తాంత్రి కములుగాను కల్పితములుగాను అప్రసిద్ధములుగా నుండుటచే భగవత్స న్నిహితములు కాకున్నవి.

కావున నియ్యదియే సర్వత్ర ప్రవర్తితంబై ముముక్షువులకు బుభుక్షువులకు జపనీయ మగుచున్నయది. శివ పంచాక్షరీమహామంత్రము ఇహపరములయందును శ్రేయస్కరమైనది. శ్రీ శివపంచాక్షరియే భోగ మోక్షకాములందరికిని గ్రాహ్యంబయ్యెను.

తొల్లి ఒకానొక మహారాజు  భార్యచే ప్రేరేపింపఁబడి గర్గ మహామునిచే శివపంచాక్షరీ మహామంతోపదేశము  తోడనే వేలకొలది పూర్వ జన్మలయందు చేసిన దురితములన్నియు కాకుల రూపముతో బయలు వెడలినట్లును సానందమహర్షి. ఈ మహామంత్ర ప్రభావమున నరక వాసులను కైలాసమునకు తీసుకొని పోయినట్లును ఉపమన్యు దధీచి గౌతమ శ్రీరామ శ్రీకృష్ణాదులు శివపంచాక్షరీమంత్రము ననుష్ఠించియే  శివానుగ్రహపాత్రులైరి.

No comments: