Adsense

Friday, May 26, 2023

సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్

సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్ (శివరహస్యాంతర్గతం)

ఇది మహిమాన్వితమైన మంత్రగర్భితమైన స్తోత్రం. శంకరులు ఈ స్ఫూర్తితోనే భుజంగప్రయాతం రచించారు. కానీ ఆ రచనకు, ఈ రచనకు సంబంధం లేదు. ఛందస్సు ఎంపిక వరకు మాత్రమే. భుజంగరూపుడైన సుబ్రహ్మణ్యుని భుజంగ ప్రయాతంలో స్తుతిస్తే ఆ శ్లోకములు మంత్రగర్భితాలు అవుతాయి. ఇది చెవిలో పడ్డా చాలు అనేక రోగాలు పోతాయి. సుబ్రహ్మణ్యుని తలంచుకుంటే రోగాలు, శత్రుబాధలు పోతాయి. అమంగళములు తొలగిపోతాయి. అసురశక్తులు నశిస్తాయి. సుబ్రహ్మణ్యుని భుజంగప్రయాతంలో మొట్టమొదట స్తుతించిన వారు దేవతలు. ఆ రహస్యం తెలిసిన మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు సుబ్రహ్మణ్యభుజంగ ప్రయాతములు రెండు రచించారు. ఈ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతాన్ని చదువుతారో వారు ధన్యులు అవుతారు. అభీష్టసిద్ధులు గొప్పగా లభించాలన్నా, దుఃఖములు తొందరగా తొలగిపోవాలన్నా నూరుమార్లు ఈ స్తోత్రాన్ని చదవడం మంచిది.

ముఖే వారణేంద్రం నఖేచార్థచంద్రం ముఖే పూర్ణచంద్రం కృపాసాంద్రనేత్రమ్!
కృతస్తుత్యుపేంద్రం పదాబ్జాననేంద్రం! భజామోస్తతంద్రం కథంకారమేతమ్!!౦౧!!
నమామోభ్రగంగాతరంగాంగసంగం సశృంగారమోంకారపాథోజభృంగమ్!
శివోత్సంగసంగం శివస్యాంతరంగం కిరాతీగణోల్లాసివల్లీభుజంగమ్!!౦౨!!
కరే శక్తిమంతం హరే భక్తిమంతం శరే జన్మవంతం హరిత్పావనం తం!
ఉదారేవనం తం సదారం వసంతం సదోంకారమంతర్భజామో గుహం తమ్!!౦౩!!
శరచ్చంద్రషట్కస్ఫురద్వక్త్రబింబం ప్రబాలప్రవాలప్రభామండలస్థమ్!
రుచా ధూతమిత్రం కృపాశీతనేత్రం భజమః సదా దేవసేనాకళత్రమ్!!౦౪!!
విధే స్వాగతం కిం హరే మంగళం కిం సఖేదాఅనుషంగం కుతో దృశ్యతేంగమ్!
క్వ వైరీ సమానీయతాం మే శతాంగమ్ కృధైవం వదంతం భజామో గుహం తమ్!!౦౫!!
క్వ శూరః క్వ వా తారకః సింహవక్త్రః క్వ వేత్యత్తహాసప్రభిన్నాండభిత్తి!
హఠాన్నీలకంఠేంద్రకంఠాధిరూఢం భజామో ముదా రక్షితారం కుమారమ్!!౦౬!!
భవద్గర్భదాసర్భకాన్ దీనబంధో హ్యవ ప్రేమయుక్తాన్ హినః క్షిప్రమంహః!
న చేత్తేపకీర్తిః అతః స్వామినం స్వం భజామో ధునీమో భవామోద్య భక్తాః!!౦౭!!
ద్విషడ్బాహుదండం ద్విషట్ చారుగండం ద్విషట్ కర్ణషండం త్రిషణ్ణోత్రతుండమ్!
హతక్రౌంచగోత్రం ధృతబ్రహ్మసూత్రం భవప్రీతిపాత్రం భజామః సుగాత్రమ్!!౦౮!!
ప్రసీద ప్రసీద ప్రభో తారకారే ప్రసీద ప్రసీద భవామో నిరీహాః!
ప్రపన్నా విపన్నాః పురా తార ఖిన్నాః భవామోద్య భిన్నాస్త్వయా దుఃఖనున్నాః!!౦౯!!
కిమర్థం సురార్థం కృతా నానుకంపా నిలింపాః పురా తారదుఃఖాభికంపాః!
భవత్పాదమోద ప్రభావాద...

No comments: