శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).
-----------------------
బ్రహ్మదేవుని కుమారుడు"మరీచి".
మరీచి కుమారుడు"కశ్యపుడు".
కశ్యపుని కుమారుడు సూర్యుడు.
సూర్యుని కుమారుడు వైవస్వత మనువు.
వైవస్వత మనువు కుమారులైన, ఇక్ష్వాకువు, నృగుడు, మొదలైన పదిమందిలో శర్యాతి మహారాజు ఒకడు.
ఒకరోజు శర్యాతి మహారాజు అడవికి వేటకు వెళ్ళాడు. ఆయన ఏకైక పుత్రిక అయిన "సుకన్య",ఇతర అంత:పురస్త్రీలు కూడా, ఆయనతో బాటు ఆ అరణ్యానికి వెళ్లారు.
ఆ ప్రాంతంలోని సరస్సు సమీపంలో,ఒక వృక్షం నీడలో భృగుమహర్షి కుమారుడైన చ్యవనమహర్షి కొన్ని వేల సంవత్సరాలనుండి తపస్సు చేస్తున్నాడు.
ఆయన దేహం చుట్టూ పుట్టలు బయలుదేరినై.
చెలికత్తెలతో వనవిహారం చేస్తున్న సుకన్య ఆ పుట్టదగ్గరకు వచ్చింది.
ఆ పుట్టలోనుండి, చ్యవనమహర్షి కళ్ళు మాత్రం మెరుస్తూ కాంతివంతముగా సుకన్యకు కనబడ్డాయి.
ఆమె అవి మిణుగురు పురుగులేమో అనుకోని ఒక పుల్లతో గుచ్చింది.
అందువల్ల చ్యవనమహర్షి కన్నులు గాయపడి ఆయన దృష్టి పోయింది.
ఆయనకు బాధ, కోపము రెండూ కలిగాయి.
తత్ క్షణమే శర్యాతిమహారాజు సైన్యానికి, పరివారానికి, మూత్ర పురీషములుబంధింపబడ్డాయి.
వారు బాధతో హా హా కారాలు చేశారు.
శర్యాతి మహారాజు దీనికి కారణం ఏమిటా అని విచారించాడు.
సుకన్య జరిగిన విషయం చెప్పింది.
శర్యాతి, చ్యవనమహర్షి దగ్గరకు వెళ్లి తనకుమార్తె చేసిన అపరాధం క్షమించమని వేడుకున్నాడు.
వయో వృద్ధుడు, నేత్రములు లేనివాడు అయిన చ్యవనుడు, సుకన్య తనకు భార్య అయి సేవలు చేసేటట్లయితే క్షమిస్తానన్నాడు.
పరివారము మరియు సైనికుల యొక్క బాధ చూడలేని సుకన్య చ్యవనుని వివాహమాడటానికి అంగీకరిస్తుంది.
రాజు వెంటనే సుకన్యా, చ్యవనులకు వివాహం జరిపిస్తాడు.
సైనికుల యొక్క, పరివారము యొక్క బాధ వెంటనే ఉపశమించింది.వారంతా నగరానికి తిరిగి వెళ్లారు.
ఆ క్షణమునుండీ సుకన్య పతివ్రతా ధర్మము స్వీకరించింది.
భర్తకు అన్నివిధములైన సేవలు చేస్తూ ఆ ఆశ్రమములో ఉండి పోయింది.
అద్భుత సౌందర్యముతో నవయవ్వనములో ఉన్న సుకన్యను చూచి అశ్వనీ దేవతలు మోహించి తమను వివాహం చేసుకొమ్మని, ఆమెను కోరుతారు.
మహా పతివ్రత అయిన ఆమె వారి కోరిక తిరస్కరిస్తుంది.
నేత్రహీనుడయినా, వృద్ధుడయినా, తనకు భర్తే పరమ దైవమని చెప్పింది.
ఆమె పాతివ్రత్యం పరీక్షింప దలచి, అశ్వనీ దేవతలు ఆమెతో ఇలా అన్నారు:
" మేము దేవవైద్యులము. నీ భర్తకు, నేత్రములు, నవయవ్వనమూ,ప్రసాదిస్తాము. నీ భర్త,మేమిద్దరమూ ఏక కాలంలోఈ సరస్సులో మునిగి లేచిన తరువాత, సౌందర్యము, యవ్వనముతో కూడిన మా ముగ్గురిలో ఒకరిని నీవు భర్తగా అంగీకరించవలెను. నీవు నీ భర్త అనుమతి తీసుకొన్న తరువాతనే ఈ పని చెయ్యవచ్చు" అన్నారు.
సుకన్య ఈ విషయం తన భర్తకు చెప్పింది.
సుకన్య పాతివ్రత్య మహిమ తెలిసిన చ్యవనుడు అంగీకరించాడు.
అశ్వనీదేవతలిద్దరితో బాటు సరస్సులో మునిగి పైకి వచ్చాడు.
ఆశ్చర్యంగా ముగ్గురూ ఓకే రూపంలో వున్నారు.
అయితే సుకన్య పాతివ్రత్య మహిమతో తన అసలు భర్తను గుర్తించి అతనినే వరించింది.
ఆమె పాతివ్రత్యానికి అశ్వనీ దేవతలు సంతోషించారు.
తనకు యవ్వనము,సౌందర్యము ఇచ్చిన అశ్వనీ దేవతలను, చ్యవనుడు స్తుతించి, ప్రశంసించాడు.
యజ్ఞములలో అప్పటి వరకు అశ్వనీదేవతలకు సోమపానం చేసే అర్హత లేదు.
" ఆ అర్హత మీకు నేను కలిగిస్తాను" అని చ్యవనుడు, అశ్వనీదేవతలకు వాగ్దానం చేసాడు.
తన అల్లుడు యౌవనాన్ని, దృష్టిని పొందాడని తెలుసుకున్న శర్యాతి, కుమార్తెను, చ్యవనుడిని చూడటానికి వారి ఆశ్రమానికి వచ్చాడు.
చ్యవనుడు శర్యాతి చేత యజ్ఞం చేయించి అశ్వనీ దేవతలకు కూడా సోమరసాన్ని సమర్పించాడు.
ఆ కార్యాన్ని దేవేంద్రుడు అడ్డుకున్నాడు.
శాస్త్రమర్యాదననుసరించి వైద్యవృత్తి చేసేవారికి శిష్టులతో సహపంక్తి భోజనం నిషేధం.
అశ్వనీ దేవతలు దేవవైద్యులు కాబట్టి వీరికి ఇతర దేవతలతో బాటు సోమపానార్హత లేదు అన్నాడు ఇంద్రుడు.
చ్యవనుడు ఇంద్రుని మాట లెఖ్ఖచెయ్యలేదు. తనకు ఉపకారం చేసిన దేవవైద్యులకు, ప్రత్యుపకారం చెయ్యాలనే నిశ్చయించాడు.
కోపించిన ఇంద్రుడు చ్యవనునిపై వజ్రాయుధం ప్రయోగింపబోయాడు.
చ్యవనుడు ఉగ్రుడయ్యాడు.
తన తపశ్శక్తితో ఇంద్రుని చెయ్యి స్తంభింప జేశాడు.
అంతే కాకుండా ఇంద్రుని సంహరించేందుకు, హోమం చేసి "మదుడు" అనే అసురుడిని పుట్టించాడు.
పదివేల యోజనాల పొడవైన బాహువులతో,నూరువేల యోజనాల పొడవైన నాలుగు కోరలతో, భూమి, ఆకాశము ఆక్రమించిన దేహంతో ఉద్భవించిన ఆ మదుడనే రాక్షసుని చూచి జగత్తు అంతా తల్లడిల్లింది.
దేవేంద్రుడు భయపడి అశ్వనీదేవతలకు సోమపానార్హత కలిగించేందుకు సమ్మతించాడు.
చ్యవనుడు శాంతించాడు.
స్తంభించిన ఇంద్రుని హస్తాన్ని యధాప్రకారం పనిచేసేటట్లు అనుగ్రహించాడు.
తాను సృష్టించిన మదుడనే రాక్షసుడిని నాలుగు భాగాలు చేసి ఒక భాగం స్త్రీ జాతిలో ప్రవేశ పెట్టాడు.
మదుడు(మదం) ప్రవేశించినందువల్ల స్త్రీలకు తమ హావభావాలతో పురుషులను పాదాక్రాంతులను చేసుకొనే శక్తి సంక్రమించింది.
మదుని రెండవ భాగాన్ని మద్యంలోను,
మూడవ భాగాన్ని జూదము లోను,
నాలుగవ భాగాన్ని వేటలోను,
చ్యవనుడు ప్రవేశింపజేశాడు.
ఇవన్నీ వ్యసనములు కాబట్టి
స్త్రీ పురుషులెవ్వరూ ఈ వ్యసనములబారి పడి, శ్రేయోమార్గం నుండి భ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవాలని మనలను హెచ్చరించడమే ఈ విభాగము యొక్క అర్థము.
రామాయణం, సుందరకాండలో, సీతాదేవి,రావణాసురుని వివాహ మాడమని తనను నిర్బంధిస్తున్న రాక్షస స్త్రీలతో
"సుకన్యా చ్యవనం యథా" సుకన్య చ్యవనుని అనుసరించినట్లు నేను రాముని అనుసరించి ఉంటాను, అని మహాపతివ్రత అయిన సుకన్యను గురించి ప్రస్తావించింది.
తన పాతివ్రత్య మహిమతో వృద్ధుడైన భర్తకు యవ్వనము,నేత్రదృష్టి, సంపాదించి పెట్టిన మహా పతివ్రత అయిన సుకన్య వృత్తాంతము,
చ్యవనమహర్షి యొక్క తప:ప్రభావము,
మహాత్ములైన శర్యాతి మహారాజు, ఇంద్రుడు, అశ్వనీదేవతల ప్రస్థావన,
వ్యసనములకు దాసులవకూడదనే హెచ్చరిక,
వీటితో కూడుకున్న ఈ ఇతివృత్తము ఎంతో పవిత్రమైనది.
ఈ ఇతిహాసాన్ని స్మరిస్తూ,భోజనమయిన తరువాత బొటనవ్రేళ్ళ కొనలనుండి, నీటిని కళ్ళల్లో పోసుకుంటే నేత్రవ్యాధులు ఉండవని పెద్దలు చెబుతున్నారు.
అన్నము తిన్న తరువాత
కాళ్ళు కడుక్కొని, ఆచమనం చేసి,ఒక గ్లాసు నీళ్లలో రెండు చేతుల బొటనవ్రేళ్ళను ముంచి,ఈ శ్లోకం చదువుతూ,ఆ బొటనవ్రేళ్ళతో నీటిని మూడు సార్లు రెండు కళ్లల్లో పోసుకోవాలి.
శ్లో// శర్యాతించ, సుకన్యాంచ, చ్యవనం చేంద్ర మశ్వినౌ/
భోజనాంతే,స్మరన్నక్షౌ,అంగుష్ఠాగ్రాంబు నిక్షిపేత్//
(శర్యాతి మహారాజును, ఆయన కుమార్తె, మహాపతివ్రత అయిన సుకన్యా దేవిని, ఆమె భర్త అయిన చ్యవనమహర్షిని, దేవేంద్రుని, అశ్వనీదేవతలను, స్మరిస్తూ, భోజనమయిన తరువాత బొటనవ్రేళ్ళతో నీటిని కళ్ళలో పోసుకొనవలెను).
ప్రతి సారి భోజనం చేసిన తర్వాత ఈ విధంగా చేస్తే ,
ఎటువంటి కళ్ళజబ్బులు రావని పెద్దవాళ్ళు చెప్పారు.
శుభమస్తు.

No comments:
Post a Comment