కావలసినవి: తెల్ల నువ్వులు: 100గ్రా‘‘; చింతపండు : 50గ్రా‘‘; ధనియాలు : 50గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగ పప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె : తగినంత.
తయారి: నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రలను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషధాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత
No comments:
Post a Comment