Adsense

Friday, June 2, 2023

దశపాపహర దశమి, గంగావతరణం

దశపాపహర దశమి, గంగావతరణం


దశపాప హర దశమి – గంగావతరణం (జ్యేష్ఠశుద్ధ దశమి)

🌷స్నాన సంకల్పం
మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే'' అని స్నాన సంకల్పం చెప్పుకోవాలి. 🌷

తర్వాత గంగమ్మ పూజ చేయాలి..
" జ్యేష్టమాసి, సితేపక్షే,
దశమ్యాం, బుధ హస్తయో,
వ్యతీపాతే, గరానందే,
కన్యాచంద్రే, వృషౌరవౌ|| "
జ్యేష్ట మాసము, శుక్లపక్షం, దశమి, వ్యతీపాత యోగము, గర కరణము, బుధవారము,హస్తా నక్షత్రములున్నందు వలన ఆనంద యోగము, కన్య యందు చంద్రుడు, వృషభమందు రవి, ఇవి పదిరకాలైన కాల విశేషాలు. ఈ పదీ కలిసి వచ్చిన రోజును దశపాప హర వ్రతము చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాప హర వ్రత లక్షణములు.
దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్‌; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్‌ అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!

ఇక దశవిధ పాపములు :-
1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,
2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,
3. పర స్త్రీని కలవడం - ఇవి మూడు శరీరం తో చేసేవి.
4. పరుషము, 5. అసత్యము, 6.కొండెములు, 7. అసంబద్దమైన మాటలు - ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.
8. ఇతరుల ధనములందు కోరిక,
9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,
10. వ్యర్ధమైన అహంకారము - ఇవి మూడూ మానసికంగా చేసేవి.ఇవే
పదిరకాలైన పాపాలు.

ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.

' ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయన్యై, రేవత్యై, శివాయై, దక్షయై, అమృతాయై, విశ్వరూపిన్యై, నందిన్యైతే నమో నమః

" అంటూ జ్ఞాన ఐశ్యర్యాది షడ్గుణవతియు, దశవిధ పాపముల హరిన్చునదియు, నారాయణ మూర్తి పాదముల నుండి పుట్టినదియు, రేవతియు, శివయు, దక్షయు, అమ్రుతయు, విశ్వరూపిణియు, నందినియూ, అగు గంగాదేవికి నమస్కారము. అని నమస్కారం చేయడం శాస్త్రాలు చెప్పిన పధ్ధతి.
జీవనాధారమూ, ప్రాణాధారమూ, అయిన గంగ లేకుండా ఏదీ జరగదూ,ఉండదూ.
అందుకే దశయోగ పర్వదినాన దశపాపహరయైన గంగను ఆరాధించడం ఆచారం.ఓ చిన్నప్రతి మయందు గానీ చెంబులోని తీర్ధమందు( కలశమందు గానీ ) గంగాదేవిని ఆవాహనము చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్టశుక్ల దశమి, ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యధావిధిగా స్తోత్రం చేసినవారికి అందని సౌభాగ్యాలుండవు. అష్టైశ్వర్యములూ ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది.

🌷గంగమ్మతల్లి పన్నెండు పేర్లు :🌷

“నందినీ నళినీ
సీతామాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జ త్రిపధగామినీ
భాగీరథీ భోగవతీ
జాహ్నవీ త్రిదశేశ్వరీ”
అంటూ గంగమ్మతల్లి పన్నెండు పేర్లనూ తలుస్తూ పదిమార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే పదిమార్లుగా స్నానం చేయడం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్లనూవులు, పేలాలపిండి, బెల్లము చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలూ మూడూ విదాలైనవీ, శరీరంతో చేసిన మూడూ విధాలైన పాపాలూ, నోటి మాటతో చేసిన మూడూ రకాలైన పాపాలూ ( మొత్తం పది ) నశించిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే పది దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ. దానం చేయడం మంచిది.

🌷శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం🌷

ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః!
నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే!!
నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః!
సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!!
సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే!
స్థాస్ను జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే!!
సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే!
తాపత్రితయసంహత్ర్యై ప్రాణేశ్యైతే నమో నమః!!
శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే!
సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే!!
భుక్తిముక్తి ప్రదాయిన్యై భద్రదాయై నమోనమః!
భోగోపభోగ్యదాయినై భోగవత్త్యై నమోస్తుతే!!
మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః!
నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః!!
నమ స్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః!
త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః!!
నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః!
నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!!
బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే!

నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!!
పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః!
పరాపరశతాధ్యాయై తారాయై తే నమో నమః!!
పాశజాల నికృంతిన్యై అభిన్నాయై నమోస్తుతే!
కాంతాయైచ వరిష్ఠాయై వరదాయై నమో నమః!!
ఉగ్రాయై సుఖజగ్ద్యైచ సంజీవిన్యై నమోస్తుతే!
బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమోనమః!!
ప్రణతార్తి ప్రభంజన్యై జగన్మాత్రే నమోస్తుతే!
సర్వాపత్ప్రతిపక్షాయై మంగళాయై నమో నమః!!
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే!
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే!!
నిర్లేపాయై దుఃఖహంత్ర్యై దక్షాయై తే నమో నమః!
పరాపరపరాయై చ గంగే నిర్వాణదాయిని!!
గంగే మమాగ్రతో భూయా గంగే మే తిష్ఠ పృష్ఠతః!
గంగే మే పార్శ్వయో రేధి గంగే త్వయ్యస్తుమే స్థితిః!!
ఆదౌ త్వ మంతే మధ్యేచ సర్వం త్వం గాంగ తే శివే!
త్వమేవ మూలప్రకృతిస్త్వం పుమాన్ పరే ఏవహి!!

🌷గంగా స్తోత్రం🌷

దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥

భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః ।
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం ॥ 2 ॥

హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే ।
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారం ॥ 3 ॥

తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం ।
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ॥ 4 ॥

పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే ।
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే ॥ 5 ॥

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే ।
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే ॥ 6 ॥

తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః ।
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే ॥ 7 ॥

పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ।
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ॥ 8 ॥

రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపం ।
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ॥ 9 ॥

అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే ।
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః ॥ 10 ॥

వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః ।
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః ॥ 11 ॥

భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే ।
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యం ॥ 12 ॥

యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః ।
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః ॥ 13 ॥

గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారం ।
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః ॥ 14 ॥

🌷శ్రీ మాత్రే నమః🌷

No comments: