Adsense

Monday, June 12, 2023

గర్భముతో ఉన్నవాళ్ళు రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము...!!

గర్భముతో ఉన్నవాళ్ళు రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము...!!



🌸కష్ట సుఖాలు, కలిమి లేములు, సంతతి కలగడం, కలగక పోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా వుండడం, చిరంజీవిగా వుండడం ఇదంతా కర్మ ఫలాలను బట్టి వుంటుంది.

🌿అంతా కర్మాధీనం అని వేదం చెబుతుంది. షష్టీ దేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఈ దేవి కధ చాలా మహిమ గలది.

🌸ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.

🌿పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది.

🌸శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత.

🌿ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ఇది.

🌸స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు, సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి,

🌿సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజ ధర్మం, అని చెప్పగా,

🌸ప్రియవ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు.

🌿ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు.

🌸తత్ఫలితముగా రాజపత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది.

🌿కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినది.

🌸ప్రియవ్రతుడు లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు.

🌸అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు?

🌿మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.

🌸“రాజా! నేను ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది.

🌿ప్రియవ్రతుడి ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు,

🌸అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు చేస్తాడు అని అన్నది.

🌿వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది.

🌸ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి, ప్రజల చేత కూడా షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.

🌿పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,పుట్టిన శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది.

🌸అన్న ప్రాశన సమయములో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును.

🌿ఆ ప్రియవ్రతుడు షష్టీ దేవిని ఈ విధముగా స్తుతించినాడు.

🌸కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.

🌿బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు.

🌸షష్టీ దేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి. ఇది షష్టీ దేవి కధ.

🌷షష్టీ దేవి స్తోత్రము

🌿నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ద్యై, శాంత్యై, నమో నమః

🌸శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

🌿వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః

🌸సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

🌿సృష్ట్యై షష్టా౦శరూపాయై, సిద్దాయై చ నమో నమః

🌸మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః

🌿సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః

🌸బాలాధిష్టాతృ దేవ్యై చ షష్టీ దేవ్యై నమో నమః

🌿కళ్యాణ దేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం

🌸ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః

🌿పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు

🌸దేవ రక్షణకారిణ్యై షష్టీ దేవ్యై నమో నమః

🌿శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా

🌸హింసాక్రోధ వర్జితాయై షష్టీ దేవ్యై నమో నమః

🌿ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి!

🌸మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి!

🌿ధర్మం దేహి యశోదేహి షష్టీ దేవీ నమో నమః !

🌸దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే !

🌿కళ్యాణం చ జయం దేహి, విద్యా దేవి నమో నమః!

🌷ఫలశృతి :

🌸ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం

🌿యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత

🌸షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం

🌿అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం

🌸వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ

🌿సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే

🌸వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం

🌿సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః

🌸కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్

🌿వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః

🌸రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్

🌿మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః

🌸జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే

🌷శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

🌿సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే

శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు...స్వస్తి.


No comments: