Adsense

Friday, June 16, 2023

శ్రీసూర్యద్వాదశనామరత్నస్తోత్రం

శ్రీసూర్యద్వాదశనామరత్నస్తోత్రం

1) నమో భగవతే మిత్రాయ
   సహస్రకిరణతేజోమయాయ
   భానుమండలవిరాజమానాయ
   వేదవేదాంగపూజితపల్లవపదాయ ||

2) నమో భగవతే రవయే
   యాజ్ఞవల్క్యజ్ఞానప్రదాయ
   శమంతకమణిప్రదాయకాయ
   త్రిసంధ్యాధిదేవతాయ            ||
,
3) నమో భగవతే సూర్యాయ 
   నవవ్యాకరణశాస్త్రవినీతాయ
   అక్షయపాత్రప్రదాయకాయ
   అజ్ఞానతిమిరాపహరాయ ||

4) నమో భగవతే భానవే
   దివ్యప్రభావగ్రహాగ్రగణ్యాయ
   ప్రణతార్తిభంజననిరంజనాయ
   సర్వశతృవినాశనకారణాయ   ||

5) నమో భగవతే ఖగాయ
   బ్రహ్మవిష్ణుశివాత్మకాయ
   కామాక్షీపరదేవతారుపాయ
   నిరతాన్నప్రదాయకాయ ||

6) నమో భగవతే పూషాయ
   ద్రౌపదీమానసంరక్షకాయ
   తీవ్రశిశిరనాశనకారణాయ 
   పవనాత్మజజ్ఞానప్రబోధకాయ ||

7) నమో భగవతే హిరణ్యగర్భాయ
  సంతతారోగ్యభాగ్యప్రదాయకాయ 
  వశిష్ఠకుంభోద్భవపూజితపదాయ
  పతివ్రతాశిరోమణిగణార్చితాయ ||

8) నమో భగవతే మరీచయే
   రక్తమాల్యాంబరధరాయ
   రక్తగంధానులేపనాయ
   రక్తపుష్పసుపూజితాయ ||

9) నమో భగవతే ఆదిత్యాయ
   చండప్రచండతీక్ష్ణస్వరూపాయ
   కర్ణకవచకుండలప్రదాయకాయ
   ఉషాపద్మినీసంజ్ఞాఛాయాసమేతాయ ||

10) నమో భగవతే సవిత్రే
   తిథివారనక్షత్రాధిపత్యాయ
   దినప్రధాననాయకాయ
   యమధర్మరాజజనకాయ ||

11) నమో భగవతే అర్కాయ
    సకాలవర్షప్రదాయకాయ
    హర్షవల్లీక్షేత్రనివాసాయ
    దివ్యప్రభావకశ్యపాత్మజాయ ||

12) నమో భగవతే భాస్కరాయ
   జగత్సాక్షిస్వరూపాయ
   కేయూరరత్నమణిహారభూషణాయ
   బుధజననమస్కారప్రియాయ ||

సర్వం శ్రీసూర్యనారాయణదివ్యచరణారవిందార్పణమస్తు.

No comments: