Adsense

Friday, June 2, 2023

దశహర గంగాస్తోత్రం

 దశహర గంగాస్తోత్రం 


జ్యేష్ఠమాసే సితే పక్షే దశమీ హస్త సంయుతా |
తస్యాం దశమ్యాంమే తచ్చ స్తోత్రం గంగాజలే స్థితః ॥

జ్యేష్ఠమాసం శుద్ధ దశమీ హస్తానక్షత్రం ఉన్న రోజు గంగాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజు దశహర గంగాస్తోత్రాన్ని శ్రద్ధగా పఠించి గంగాస్నానం చేసిన వారికి పాపాలన్నీ క్షయమైపోతాయి.

"ఓ గంగా! నీవు శివస్వరూపురాలివి, మంగళాలని ప్రసాదించేదానివి, విష్ణు స్వరూపిణివి, బ్రహ్మరూపిణివి, రుద్ర స్వరూపానివి, సర్వదేవతా స్వరూపిణివి. సకల వ్యాధుల్నీ నయం చేసే ఔషధమూర్తివి, భుక్తి ముక్తి ప్రదాయినివి, శక్తి స్వరూపిణివి, ముక్తి కాంతవి. నీకు నమస్కారం.

అమ్మా! గంగమ్మా! నా ముందు, వెనకా, ఇరుపక్కలా ఉండి నన్ను రక్షించు. ఆది అంతం మధ్యలో నీవే ఉన్నావు. మూలప్రకృతివి, పరమాత్మవి, పరమ పురుషుడివి, పరమేశ్వరుడివీ నీవే”

ఈ విధంగా గంగాదశహర స్తోత్రాన్ని పఠించినా, విన్నా సకల పాపాలూ నశిస్తాయి. సకల మనోరధాలూ నెరవేరతాయి. ఈ దశహరస్తోత్రాన్ని స్వయంగా చేత్తో రాసి స్వగృహంలో ఉంచుకుంటే అగ్ని, చోర, సర్పాది భయాలేవీ వుండవు. గౌరీదేవిని ఎలా పూజిస్తామో గంగానదిని కూడా అలాగే పూజించాలి.

No comments: