Adsense

Thursday, June 29, 2023

ఋణ బాధలు తొలగించే అయ్యప్ప పూజా విధానం.!!


అప్పులు తీరడానికి, ఋణబాధలు తొలగడానికి ప్రతి బుధవారం ఇంట్లో గానీ, దేవాలయంలో గానీ, స్త్రీలు గానీ, పురుషులు గానీ, అయ్యప్పకు తులసి మాల సమర్పించి, 108 శరణుఘోష నామాలు చెప్పి, లోకవీరం మహాపూజ్యం స్తోత్రాన్ని పఠించాలి.
దీని వల్ల ఋణబాధలు తీరిపోతాయి.
లోకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!
విప్రపూజ్యంవిశ్వవంద్యం విష్ణు శంభో శివం సుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!
మత్తమాతంగగమనం కారున్యామృత పూరితం
సర్వ విఘ్న హారం దేవం శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!
అస్మత్ కులేస్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!
పాంద్యేశవంశతిలకం కేరలేకేళివిగ్రహం
ఆర్తత్రాణవరందేవం శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!
పంచ రత్నఖ్య మేతద్యో నిత్యం స్తోత్రం పటేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే
స్వామియే శరణం అయ్యప్ప.

No comments: