Adsense

Sunday, June 18, 2023

మనుష్య జీవితం- పరమార్ధం

*1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|*
         *అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||*

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

*2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|*
      *సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||*

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

*3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|*
      *జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||*

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

*4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|*
      *ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||*

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు.
కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

*5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|*
      *విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||*

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

*6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|*
      *యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||*

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

*7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|*
      *తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||*

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

*8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|*
      *ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||*

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

*9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|*
      *తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||*

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

*10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|*
      *ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||*

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా – ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

No comments: