Adsense

Wednesday, July 12, 2023

తెలుగులో 'కేడిగాడు, ఓసీగా వచ్చింది' అని అంటారు. కేడీ, ఓసీ అంటే అర్థం ఏమిటి?

తెలుగులో 'కేడిగాడు, ఓసీగా వచ్చింది' అని అంటారు. కేడీ, ఓసీ అంటే అర్థం ఏమిటి?

నిజమే! "వీడో పెద్ద కేడీగాడు, ఓసీగా ఒస్తే ఏదీ వదలడు", ఇలా ఈ పదాల్ని మనం తరచూ వాడుతూన్నా వీటి అసలు అర్థాలేంటో తెలీదు చాలా మందికి. ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో పెత్తనం చెలాయించే కాలానికి వెళ్ళాలనమాట. ఎందుకంటే వీటి మూలాలు ఈస్ట్ ఇండియా కంపెనీలోనే ఉన్నాయి కాబట్టి.

K.D (కే డి) :

ఈ పదాన్ని మోసగాళ్ళని, అతితెలివి ప్రదర్శనలు చేసేవాళ్ళని ఉద్దేశించి వాడుతుంటాం. Known Dacoit (నోన్ డెకాయిట్) లేదా Known Depradator (నోన్ డిప్రెడేటర్) అనే పదాలకి కుదింపు పేరు K.D. స్వాతంత్ర్యం రాకముందు భారత పోలీసులు తమకు తెలిసిన నేరస్థులను వర్గీకరించడానికి ఈ పదబంధాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఇదే కాలక్రమేణా సాధారణ జనానీకపు నోళ్ళలో కేడీ (KD) గా స్థిరపడిపోయింది.

O.C (ఓసీ) :

ఉచితంగా వచ్చే వాటిని ఉపయోగించేవాళ్ళనుద్దేశించి ఈ మాటని వాడతారు.

ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవారు కంపెనీకి సంబంధించిన ఉత్తరాలను, కొరియర్లను పంపేటప్పుడు "On Company Service (OCS)" అని వర్గీకరించి స్టాంపు వేసి పంపేవారు. కొంత మంది ఉద్యోగులు దీనిని వ్యక్తిగత ఉత్తరాలకు, కొరియర్లకీ కూడా వాడేయటం మొదలు పెట్టారు. OCS సేవలను ఉచితంగా స్వప్రయోజనాలకి వాడేయటం మొదలైనప్పటి నుంచి ఈ పదం జన సామాన్య వాడుకలోకి వచ్చి చేరి 'ఓసీ' గా స్థిరపడింది.

(సేకరణ)

No comments: