Adsense

Wednesday, August 23, 2023

సర్వ శుభప్రాప్తికి గణేశ లఘుస్తుతి

సర్వ శుభప్రాప్తికి గణేశ లఘుస్తుతి:

గణపతి ర్విఘ్నరాజో లంబతుండో గజాననః|
ద్వైమాతురశ్చ హేరంబో ఏకదంతో గణాధిపః॥
వినాయక శ్చారుకర్ణః పశుపాలో భవాత్మజః|
ద్వాదశైతాని నామాని ప్రాత రుత్థాయ యః పఠేత్|
విశ్వం తస్య భవేద్వశ్యం నచ విఘ్నం భవేత్ క్వచిత్ II

1. గణపతి
2. విఘ్నరాజు
3. లంబతుండుడు
4. గజాననుడు
5. ద్వైమాతురుడు
6. హేరంబుడు
7. ఏకదంతుడు
8. గణాధిపుడు
9. వినాయకుడు
10. చారుకర్ణుడు
11. పశుపాలకుడు
12. భవాత్మజుడు

ఈ 12 నామములను ప్రాతఃకాలమున నిద్రలేచి ఎవడు స్మరించునో, వారికి విశ్వమంతయు వశమగును. సర్వకార్యములందు ఎంతమాత్రము విఘ్నము కలుగదు.

ఇందు ద్వైమాతురుడు = ఇద్దరు తల్లులు (పార్వతి, గంగ) కలవాడు. అని సామాన్యార్థము. పార్వతి గణపతిని సృష్టించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తల్లి. శివుడు గణపతి శిరసును ఖండించిన పిదప ఒక ఆడ ఏనుగుగున్న శిరస్సును తీసుకువచ్చి దేవతలు గణపతికి అమర్చిరి. ఆ విధముగా గణపతికి రెండవసారి జన్మనిచ్చిన ఆడ యేనుగు రెండవ తల్లి అని ఒక పురాణ కథనము. పశుపాలకుడు అనగా సర్వప్రాణులు పశువులే. అనగా దేవుడే ఆ జీవులనందరిని పాలించువాడు. కాబట్టి పశుపాలకుడు. ఖాట్మాండులో ఉన్న శివుని పేరు పశుపతి నాథుడు. భవాత్మజుడు = భవుడనగా శివుడు. శివుని ఆత్మజుడు (కొడుకు)

ఓం శ్రీ గణేష శరణు..

No comments: