Adsense

Friday, August 25, 2023

మన భారతీయ జ్యోతిష విధానములో నామ నక్షత్రమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

మన భారతీయ జ్యోతిష విధానములో నామ నక్షత్రమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
దేశే జ్వరే గ్రామ గృహప్రవేశే సేవాసు వ్యవహార కార్యే
ద్యూతేషు దానేషుచ నామరాశిః యాత్ర వివాహేషు జన్మరాశిః
గ్రామప్రవేశ, గృహప్రనేశ, సేవ, వ్యవహార, జూద, దానాది విషయములందు నామ రాశినే లెక్కలో తీసుకోవాలని శాస్త్ర వచనము.
లోకంలో వాడుకపేరుతో వ్యవహారాలు నడపమని చెప్పబడడంతో పంచాంగాలలో నామ నక్షత్ర పట్టికను అందించడం జరుగుతోంది. కాని వివిధ పంచాంగాలలో  ఇచ్చే వివరాలు సంపూర్ణంగా లేకపోవడం, కొన్ని అక్షరాలను తొలగించడం జరిగింది.
అలాగే వివిధ ప్రాంతీయ భాషలలో కూడా వేరు వేరు అక్షరాలు చెప్పబడడంతో రానురాను సందేహాలు పెరిగిపోతున్నాయి.
వీటిని సరియైన క్రమంలో పెట్టడానికి ఎంతో కృషి చేసినవారు శ్రీ ఉపదృష్ట సూర్యనారాయణ మూర్తిగారు. చాలా కాలం పరిశోధించి ఆ వివరాలను గ్రంథస్థం చేయడం జరిగింది.  వారి  సౌజన్యంతో ఆ వివరాల పట్టికను మా ప్రియ పాఠకులకు అందిస్తున్నాము.
సమగ్రమైన ఈ పట్టికను ప్రింటు తీసుకుని లేదా సేవ్ చేసుకుని  ఉపయోగించుకునే విధంగా ఇవ్వడం జరిగింది.  దీనిని మీతో పాటు మీ మిత్రులకు అందజేయగలరు.

No comments: