Adsense

Sunday, August 20, 2023

శివ కేశవుల ఆలయం...!! #shiva #temple

 

     
🌿సుమారు 600 సంవత్సరాల క్రిందట మదురైలో విజయనగర రాజుల ప్రతినిధి ,తర్వాత నాయక రాజ వంశ మూలపురుషుడుగా మదురను ఏలిన   విశ్వనాధ నాయకుని పాలనా కాలంలో  నిర్మించబడిన ప్రసిధ్ధ దేవాలయం .

🌸 కంబరాయ పెరుమాళ్ - కాశీ విశ్వనాధ ఆలయం.  ఈ ఆలయంలో శివ కేశవులు ఇద్దరూ  ఒకే
అంతస్తులో తూర్పుముఖంగా  దర్శనమిస్తున్నారు.

🌿శివ కేశవులనిద్దరిని ఒకే స్థలంలో అర్చించి ఆరాధించాలని విశ్వనాథ నాయకుని ఆశయం.

🌸అందుకు తగినట్లుగానే విశ్వనాథ నాయకుని కలలో  మహావిష్ణువు దర్శనమిచ్చి తాను పశ్చిమ కనుమల  చరియలలో శిలావిగ్రహ స్ధంభ రూపంలో వున్నట్లు , తనను
తీసుకు వచ్చి ప్రతిష్టించమని ఆదేశించాడు.

🌿మహావిష్ణువు ఆజ్ఞానుసారం ఆ శిలావిగ్రహంతో పాటు
తాను కాశీ నుండి తీసుకుని వచ్చిన  శివలింగాన్ని కూడా కాశీవిశ్వనాధుడనే పేరుతో ప్రతిష్టించాడు.

🌸ఇక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారి సన్నిధి వున్నది.  శివ కేశవులు ఇరువురికి విడి విడిగా ధ్వజస్ధంభములు వున్నవి.క్YYఇక్కడ  చేతిలో కమండలంతో దక్షిణామూర్తి దర్శనమిస్తున్నాడు. 

🌿ఈ ఆలయం చుట్టూ విశ్వనాథ నాయకుడు తమ యుధ్ధ సైనిక దళాలు
విడిది చేయడానికి ఆలయం  చుట్టూ పెద్ద కోటలు నిర్మించాడు.

🌸కోటచుట్టూ శతృవుల రాకపోకలను పర్యవేక్షించడానికి తగిన ప్రహారీ గోడలు నిర్మించారు.  ఆ ప్రాకార గోడలలో ఇప్పుడు మొట్టయాండి
ఆలయం వున్నది. 

🌿పిదప కాలంలో ఆ స్థలాన్ని కంబనాయకర్
పాలించినందున ఆ ఊరికి కంబం అని
స్ధంభ మహావిష్ణువుకి
కంబరాయ పెరుమాళ్ అని పేరు వచ్చింది.

🌸కాలక్రమేణా ఆలయం చుట్టూ కోట వున్నందున  కోట్టైకోయిల్ అని ప్రజలు పిలువసాగారు. మహావిష్ణువు కి మూడు సంవత్సరాలకి ఒకసారి
రధోత్సవం జరుపుతారు...స్వస్తి..

No comments: