Adsense

Saturday, September 2, 2023

ఆపోశనం పట్టడం ఎలా?...!!




🌿బ్రాహ్మణాది త్రైవర్ణీకులు భోజనం చేసేముందు తప్పకుండా ఆపోశనపట్టి భుజించాలి.  పూర్వాపోశనం అంటే ఏమిటో, ఎలాగో తెల్సుకుందాం. 

🌸భోజనానికి పూర్వం  నీటిని మంత్రపూర్వకంగా త్రాగే విధానాన్నే పూర్వ+అపః+అశనం= పూర్వాపోశనం అని అంటారు. భోజనానికి విస్తరి ముందరకూర్చోని చేసే ప్రక్రియను పూర్వాపోశన అంటారు. 

🌷దానిని ఈ క్రింది విధంగా చెయ్యాలి.

🌿చేతిలోకి నీటిని తీసుకొని గాయత్రీమంత్రము చెప్పి అనీటిని విస్తరిలోని అన్నాదిపదార్ధాల మీద మార్జన చేయాలి (మార్జన అంటే చల్లడం).

🌸ఆ తర్వాత కుడిచేతిలోకి నీరు తీసుకొని ఎడమచేతితో విస్తరిని (లేక కంచమును) తన‌ ఎదుటిభాగంలో మధ్యవేలితో తాకి  అక్కడనుండి తన ఎడమచేతి వైపు నుండి కుడిచేతి వైపు వరకు తన చేతిలోని నీరుని పగలైతే "సత్యం తర్త్వేన పరిషించామి" అని, రాత్రి అయితే "ఋతంత్వా సత్యేన పరిషించామి" అంటూ పరిషేచన చేయాలి (పరిషేచన చెయ్యడం అంటే ఆ నీటిని విస్తరి చుట్టూ పోయాలి). 

🌿 "అమృతమస్తు" అంటూ  కుడిచేతిలోకి నీరును తీసుకొని లేదా వేయించుకొని, "అమృతాపిథానమసి" అంటూ చేతిలో ఉన్న ఆ నీరును త్రాగాలి. 

🌸ఆతర్వాత ఎడమచేతితో విస్తరిని తాకి కుడిచేతి బ్రొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేళ్ళతో అన్నం మెతుకులను తీసుకొని

🌿1. ఓం ప్రాణాయ స్వాహా
2. ఓం అపానయ స్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5 ఓం సమానాయ స్వాహా

🌸అంటూ ఐదుసార్లు పళ్ళకు తగలకుండా అంగిట్లోకి (నోటిలోపలికి) తీసుకోవాలి...స్వస్తీ.

No comments: