THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, November 28, 2023
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే ఉత్తమ ఆహారాలు :
సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి.
ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది.
*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే ఉత్తమ ఆహారాలు.*
బీట్ రూట్ :*
ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.
క్యారెట్ :*
క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*
బొప్పాయి :*
బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.
వెల్లుల్లి :*
శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.
ఆకుకూరలు :*
శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.
దానిమ్మ :*
ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి
ఎండు ద్రాక్ష :*
రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.
ఖర్జూరం :*
ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment