పొన్నచెట్టు
పొన్న గింజల తైలంతో మర్ధన చేస్తే, కీళ్లనొప్పులు, వాతనొప్పులు హరిస్తాయి. ఈ తైలాన్ని పూస్తే గజ్జి, చిడుము వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.
చెట్టు బెరడును మెత్తగా నూరి పట్టించినా, ఆకులు వెచ్చచేసి కట్టినా గడ్డలు కరిగిపోతాయి.
బెరడు కషాయాన్ని కొద్ది రోజుల పాటు పరగడుపున రోజూ 50 మి. లీటర్ల చొప్పున తాగుతూ ఉంటే మూత్రం సాఫీగా ఉంటుంది.
పొన్న గింజలను మెత్తగా నూరి పట్టిస్తే, గాలి బిళ్లలు, కణుతులు తగ్గిపోతాయి.
ఎంతకూ మానకుండా, దీర్ఘకాలంగా బాధిస్తున్న పుండ్లపై పొన్న గింజల తైలాన్ని రాస్తూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి.
No comments:
Post a Comment