THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, December 13, 2023
Curry Without Vegetables # వెజిటేబుల్ లెస్ కర్రీ
వెజిటేబుల్ లెస్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 10 గ్రా., నీళ్లు – ముప్పావు గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు.
శనగపప్పు – 2 టీ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, మినపగుళ్లు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, ఎండుమిరపకాయలు – 6, నూనె – అర టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ.
వెజిటేబుల్ లెస్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో, కరివేపాకు తప్ప మసాలా పేస్ట్ కు కావల్సిన మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరవేపాకును కూడా వేసి వేయించాలి. ఇలా వేయించిన పదార్థాలన్నీ చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేయాలి. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెజిటేబుల్ లెప్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి కూరగాయలు ఉపయోగించకుండా చేసిన ఈ కర్రీని అందరూ ఇష్టపడతారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment