Adsense

Saturday, February 24, 2024

ప్రాతః కాలం నిద్ర లేస్తూ మనం నిత్యమూ చేసే పనులనే ఒక నియమం ప్రకారం, ధర్మబద్ధంగా చేస్తే చాలు మనకు విశేషమైన పుణ్యమే వస్తుంది.

 ప్రాతః కాలం నిద్ర లేస్తూ  మనం నిత్యమూ చేసే పనులనే ఒక నియమం ప్రకారం, ధర్మబద్ధంగా చేస్తే చాలు మనకు విశేషమైన పుణ్యమే వస్తుంది.   ధర్మం రెండు రకాలు ద్రవ్యంతో చేసేది(యజ్ఞం, యాగం లాంటివి), దేహంతో చేసేవి(తీర్ధయాత్రలు, స్నానసంధ్యలు లాంటివి) ధర్మం వల్ల ధనం లభిస్తుంది. తపస్సు వల్ల దివ్యత్వం కలుగుతుంది.  దివ్యత్వం వల్ల నిష్కామకర్మాచరణం అలవడుతుంది తద్వారా చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి.  1. ప్రాతః కాలం:  నిద్ర లేస్తూ  మెలుకువ రాగానే ముమ్మారు "శ్రీ హరి" అని బయటకి పలకాలి ఆ పిదప, ముగ్గురమ్మలకి నిలయాలైన మన అరచేతులను చూసుకుని కండ్లకద్దుకొంటు, కింద ఇచ్చిన శ్లోకం చెప్పాలి.  
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే పార్వతి/గౌరీ కరస్పర్శేన శుభంకురు  
లేచి నిలబడే ముందు నేల మీద కాలు పెట్టే ముందు భూదేవిని ధ్యానము చేయాలి.  
సముద్రవసనే దేవీ, పర్వతస్థనమండలే విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే 
- హరే కృష్ణ గోవిందా.

No comments: