Adsense

Sunday, March 24, 2024

సుభిక్షాన్ని అనుగ్రహించేసూర్య దేవుని ఆలయాలు...!!




1)దక్షిణార్కా ఆలయం
(గయ..బీహార్)

గయలో వున్న యీ ఆలయం ప్రాచీనమైనది.

విష్ణుపాద ఆలయానికి సమీపాన  తూర్పు ముఖంగా వున్నది.

ఈ ఆలయంలో లెక్కకు
అందని సూర్యనారాయణ
మూర్తి విగ్రహాలు వున్నాయి.  ఇక్కడ వున్న సూర్యభగవానుడు ,
గుండె కు కవచాన్ని
ధరించి సుందరంగా దర్శనమిస్తున్నాడు.

ఆలయ తూర్పు దిశలో సూర్య గుండ తీర్ధం. విష్ణు, బ్రహ్మ  ,పరమశివుడు
త్రిమూర్తులతో , సూర్యుడు, దుర్గ విగ్రహాలు యిక్కడ వున్నవి.

ఇంకా కొన్ని సూర్యభగవానుడి ఆలయాలు గయలోను, గయను చుట్టిన ఊళ్ళలోను వున్నవి.

2)బ్రహ్మన్యదేవ్ ఆలయం
(ఉణవ్ మధ్యప్రదేశ్)

మధ్యప్రదేశ్ ఝాన్సీ కి సమీపమున వున్నది ఉణవ్.ఇక్కడ ప్రసిద్ధి చెందిన బ్రహ్మన్యదేవ్ ఆలయం అనే పరంజూ ఆలయం వున్నది.

సూర్యభగవానుని ఆలయమైన యీ ఆలయంలో సూర్యనారాయణుడు పరమ సౌందర్యంతో దర్శనానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు.

కుష్టువ్యాధి వారు, దృష్టి లోపాలు వున్నవారు 
సూర్య భగవానుని యీ ఆలయంలో ప్రార్ధించి ఆరోగ్యమును పొందుతున్నారు.

ఈ ప్రాంతాన్ని ఏలిన పీష్వాల ఇష్ట దైవం ఈ సూర్యభగవానుడు.

3)సూర్యబహార్
(అస్సాం)

అస్సాం రాష్ట్రంలోని గోల్పారా సమీపమున సూర్యబహార్ కొండ మెట్ట  మీద నిర్మించబడినది యీ ఆలయం.

వలయాకారంలోని రాళ్ళ
వేదిక మీద ద్వాదశ సూర్యులు దర్శనమిస్తున్నారు.  మధ్యలో సూర్య భగవానుని తండ్రి కశ్యప ప్రజాపతి దర్శనమిస్తున్నాడు.

కశ్యప ప్రజాపతి  అదితి
దంపతుల పుత్రుడే సూర్యభగవానుడు.
ఈ దంపతులకు యిక్కడ
విశిష్టమైన స్థానం

కాలిక పురాణంలో, సూర్యుని
కొండ, మరియు శిఖరాన్ని
గురించి  వివరించబడినది. అది యీ కొండే అంటారు.

ఈ శిఖరానికి అడుగున
ఒక లక్ష శివలింగాలు
వుండేవిట..కాలక్రమంలో
చాలా వరకు మాయమైనవి. ఈనాటకి
ఈ కొండ లోయలో అనేక శివలింగాలు కనిపిస్తాయి.

4)అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి
(ఆంధ్రప్రదేశ్)

ఈ ఆలయం 7 వ శతాబ్దంలోనిది.  కళింగదేశపు రాజు నిర్మించీనది. 5 అడుగుల ఎత్తుతో, చేతిలో పద్మాన్ని ధరించి, ఉషా, ఛాయాదేవి సమేతుడై
దర్శనమిస్తున్నాడు.

ఈ స్వామి కి పద్మపాణి అనే పేరు వున్నది. చేతిలోని పద్మం జ్ఞానాన్ని
చూపిస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కాకుళానికి సమీపమున
వున్నది యీ ఆలయం.

5)మోదేరా సూర్యభగవానుని
ఆలయం
(గుజరాత్)

1026--లో  కోణార్క్ ఆలయంలాగే  నిర్మించబడినది సూర్యనారాయణ మూర్తి ఆలయం.

ఉత్తరాయణ పుణ్యకాలం
మొదటి రోజున సూర్యుని విగ్రహం మీద సూర్య కిరణాలు పడతాయి.
మండప స్ధంభాల మీద
సూర్యభగవానుని  శిల్పాలు వేరు వేరు భంగిమలలో దర్శనమిస్తాయి.

ఇక్కడే ప్రతి సంవత్సరం
జనవరి మాసంలో
".మోద్రా నాట్య ఉత్సవం"
ఘనంగా జరుపుతారు.

No comments: