Adsense

Saturday, March 23, 2024

దీనినే గోకర్ణం అనే వారు.

దీనినే  గోకర్ణం  అనే వారు.  లోగడ వివాహాలలో  ఈ గిన్నెతో పులుసు వడ్డించే  వారు.  ఈ  గిన్నె లోపల  కళాయి  వేసే వారు.  కళాయి  లేకుండా  పులుసు వంటి  పులుపు వస్తువులు  వడ్డిస్తే , ఆ పదార్థాలు  కిలము పట్టి  తొందరగా  పాడవుతాయి  అని  గిన్నె లోపల కళాయి వేయించే వారు.  ఆ కాలంలో   వివాహాలలో  పల్చని సగ్గుబియ్యము మరియు  సేమియాతో  తయారుచేసిన పాయసం కూడా  గోకర్ణంతో   ఆకు దొన్నెలలో  పోసేవారు.  క్రమంగా  వడ్డించడం అనే సాంప్రదాయం కనుమరుగయ్యేసరికి  ఆనాటి  వస్తువులు  కూడా కనిపించడం  అపురూపమయ్యాయి.  ఇప్పుడంతా  " బాబ్బాబు  రాంబాబు  " అనే బఫే భోజనాలే కదా !  స్పూనుతో  వడ్డనలే.

No comments: