Adsense

Tuesday, March 5, 2024

తుష్టాయ నమః అని నిత్యం జపించే భక్తులజీవితాలు సుఖంగా, ఆనందంగా. ఉండును

తుష్టాయ నమః...!!
       

రావణ సంహారానంతరం బ్రహ్మ, ఇంద్రాది దేవతలు , అష్టదిక్పాలకులు  అందరూ
ఆకాశం నుండి శ్రీ రాముని మీద పుష్పవృష్టి కురిపిస్తూ
స్తుతించసాగారు.

  " అనంత విశ్వ సృష్టికర్తవు నీవే సృష్టిస్థితి లయాలకు ఆదిపురుషుడవు నీవే.

ఈ విశ్వం సృష్టించడానికి ముందూ మీరు వున్నారు.
ప్రళయంలో విశ్వమంతా
మునిగిపోయిన పిదప కూడా మీరు వున్నారు"  అని దేవతలంతా స్తుతించడం రామునికి రుచించలేదు.
శ్రీ రాముడు వారి స్తోత్రాలకు  అడ్డుపడి ఈవిధంగా అన్నాడు.

" నేను భగవంతుడిని కాను. దశరధ మహారాజు పుత్రుడిని మాత్రమే.  మీరు స్తుతించేంత కీర్తి దాశరధిగా నాకు లేదు. " అని అన్నాడని
వాల్మీకి రామాయణం
యుధ్ధకాండ 120-11 లో వర్ణించబడింది.

శ్రీమద్రామాయణాన్ని  రామానుజాచార్యులవారికి వారి మేనమామయైన తిరుమలై నంబి క్రింది తిరుపతిలో ఒక చింత చెట్టు క్రింద  సంపూర్ణంగా ఉపదేశించారు.

తిరుమలై నంబి శ్రీ రాముడు చెప్పిన
యీ విషయాలకు
విశిష్టమైన వ్యాఖ్యానం చేసారు.
రాముడు  ఏమన్నాడంటే

" దేవతలారా.. నేనే విశ్వానికి మూల కారణం అని బ్రహ్మదేవుని
సృష్టించినది నేనేననిఎన్నో విధాల స్తుతించారు.

కాని యీ విశిష్టతలన్నీ
వేదాలలో మునుపే వివరించబడి వున్నవి. నేను ఒక
సామన్య మానవునిగా జన్మించాను.

ఈ జన్మలోని నా గుణగణాలను మాత్రమే కొనియాడవచ్చును  కదా..
నా అతీత శక్తులను కీర్తించే కన్నా ఈ జన్మలో నేను గడిపిన    నిరాడంబర జీవితాన్ని ప్రశంసిస్తే అదే
నా కీర్తిగా భావిస్తాను.

నన్ను  నారాయణ, వాసుదేవ, వైకుంఠనాధా అనే పేర్లతో కాక ఈ జన్మలోని  రాముడనే
పవిత్ర నామంతో పిలిచిన చాలు.

శ్రీరాముడని నన్ను పిలిచే కంటే  దశరధ
పుత్రుడనని మీరు  నన్ను పిలిస్తే
ఇంకా సంతోషిస్తాను."

రాముడన్న  ఈ మాటలకి అర్ధం తనను భగవంతునిగా స్తుతించే కన్నా   పితృవాక్య పరిపాలకుడైన ఒక మహారాజు
పుత్రుని గా కీర్తించడమే
శ్రీ రామునికి ప్రీతిపాత్రం.

ఎందుకంటే   వైకుంఠంలోని మహావిష్ణువు చెంతకు భూలోకంలోని
భక్తులు వెళ్ళలేరు.
దశరధుని పుత్రునిగా అవతరించినందువలన
ప్రజలంతా సులభంగా ఆ అవతారపురుషుని దగ్గరకు వెళ్ళగలిగారు.

తన తండ్రిని తనే ఎన్నుకునే శక్తి మంతుడైన
భగవంతుడు రామావతారంలో తన తండ్రిగా దశరధుని ఎన్నుకుని నిరాడంబరమైన మానవతామూర్తిగా
భక్తదాసులకు దర్శనమనుగ్రహించాడు దశరధ మహారాజు పుత్రునిగా మహావిష్ణువు అవతరించాడు.

భక్తులందరూ తన వద్దకు వచ్చే మంచి అవకాశాన్ని
కలిగించిన అవతారం.
అందువలన తనని  దశరధ  మహారాజు పుత్రడనని చెప్పుకోవడంలోనే  సంతోషాన్ని అనుభవించినవాడు రాముడు.

ఈనాటికి శ్రీవైష్ణవులు అంతా
రాముడని అనకుండా
చక్రవర్తి కుమారుడని (దశరధాత్మజం)
పిలుస్తారు.

ఈవిధంగా  దశరధ మహారాజు పుత్రుడనని
తెలుపుతూ రాముడు
సంతోషిస్తున్నందు వలన
'తుష్టః" అని పిలువబడుతున్నాడు.'తుష్టః' అంటే సంతోషించే
వాడని అర్ధం.

దశరధ మహారాజు  పుత్రుడిగా అవతరించి భక్తులందరిని సులభంగా
అనుగ్రహించి ప్రసన్నుడైనందున
" రామునికి'' తుష్టః అనే
పేరు వచ్చింది.

యీ నామమే అనంతుని
ఆనంద నామములలో
393 వ నామము.

' తుష్టాయ నమః అని నిత్యం జపించే భక్తుల
జీవితాలు సుఖంగా, ఆనందంగా వుండేలా
శ్రీ రాముడు అనుగ్రహిస్తాడు..

No comments: