Adsense

Thursday, April 4, 2024

స్త్రీల గడ్డము అందంగా ఉండేందుకు చేయాల్సిన వ్యాయామం (సులభమైన పూర్వ పద్ధతి) Chin shape exercises for women

గడ్డము..:

* పలుచని శరీరము గలవానికి గడ్డ మెల్లప్పుడును అందముగ నుండును. కొంచెము స్థూలముగ నున్న వారిలో కొంతమందికి గడ్డముక్రింద కండ పెరిగి రెండు గడ్డములవలె జూపట్టి యందమును చెడుచుటయు గలదు. అట్టిదానినుండి తప్పించు కొనుటకు మూడు మార్గములు కలవు. గడ్డము క్రిందనున్న కండను బిగియబట్టి కంఠముపై చేయినుంచి చర్మమును క్రిందికిలాగి ఆకండను మెల్లెగ యటు నిటు రుద్ది సరిచేయుట మెదటి విధానము. ఇది చాలా కాలము చేసిన గాని ఫలితము కనబడదు. రెండవది కట్లుకట్టుటచే కండ్లను సరియయిన స్థానమున నుండునట్లు చేయుట. కొన్ని నెలలపాటు ప్రతిరాత్రియు, గడ్డముక్రింద కండను, చమురుతో నిమిరి గుడ్డతో చెవులమీదుగా కట్టుకట్టినచో కండ తగ్గును. కట్టుగట్టిగయుండీ రక్తప్రసారము నాపు చేయునట్లుండ రాదు. గట్టిగ లేకున్నచో కట్టిన లాభమేయుండదు. పరిశ్రమ చేయుట మూడవ విధానము. ఇది తప్పక గుణ మిచ్చుటయే గాక త్వరలోకూడ దీని ఫలితమును చూడనగును. తలను వీలయినంత వెనుకకును ముందునకును నెమ్మదిగా యాడించుము. తల ముందుకు వచ్చునప్పుడు నోరు బాగుగా తెరచి యుంచి గడ్డముక్రింది కండరముల బిగబట్టుము. తలపైకి వెళ్లినప్పుడు కండరముల బాగుగ సాగనిమ్ము. తలను ప్రక్కలకు వీలయినంత వరకు, గడ్డము భుజముల మీదికి పోవునట్లు త్రిప్పుట, తరువాత చేయవలసిన పరిశ్రమ. ఇట్లు చేసినచో కొన్ని వార ములలో గడ్డము మార్పు చెందినట్లు చూడవచ్చును.

A person with a thin body is always beautiful. Some people who are slightly obese can have a growth of muscle under the chin, which can look like two chins. There are three ways to avoid it. By tightening the muscle below the chin, pull the skin down from the hand on the neck and gently rub the muscle. This has been done for a long time but no result is seen. The second is to keep the eyelets in the correct position. Every night for a few months, a bandage under the chin and an oil-soaked cloth over the ears will reduce the swelling. Blood circulation does not come as it should. If it is not hard, there will be no profit. Industrialization is the third approach. It must be good but I will not see the result soon. Slowly move the head backwards and forwards as far as possible. As the head comes forward, the mouth opens wide and the chin muscles tighten. Stretch the muscles as you go overhead. The next exercise is to tilt the head as far as possible, so that the chin does not fall over the shoulders. If you do this, you will see a change in the beard within a few weeks.

No comments: