ఎంత సుందర వదనమునకైనను పాఁచిపట్టిన పండ్లు అందవికారము నాపాదించును. అందవికారమును గొని తెచ్చుటయే కాను జీర్ణకోశమునకు సంబంధించిన అనేకరోగము లకు అవి ఆహ్వాసక ర్తలు కాగలవు. పిప్పిపండ్లు, పాఁచిపట్టిన పండ్లు ఆరోగ్యమును భంగించు నవి గావున దంతములను అతిశుభ్రముగ నుంచుకొనవల ముసు. మనము పడుకునుండి లేచినతోడనే దంతధావనముచేయుట అమళ్యూతాచారమై యున్నది. ఇది యెంతయు మంచి ఆచారము. పడుకొనబోవు పుడుకూడ పండ్లు తోముకొనుట అవశ్యము అవలంబింపవలసిన ఆచారము, ఏమందురా? మాటలాడుట, నవ్వుట, ఏదైన పదార్థములను తీసికొనుట మొదలగు పనులు చేయుచున్నంత కాలమును నోటినుండి 'సెలై వా' (నోటియందు ఊరెడు నీరు) ఊరుచు దంతశుద్ధికి కొంతవరకు తోడుపడుచుండును, మనము నిద్రించునపుడట్లుకాదు. 'సెలైవా' ఊరుట' తగ్గియుండును; గావున అప్పుడు పండ్లసందున యిఱుకుగొను పదార్థశికలములు పులిసి బాక్టీరియా రోగమునకు మార్గము ఏర్పఱచును. కావున పండుకోసపోవునపుడు పండ్లసందున ఎట్టి పదార్థము ఇఱుకుకొని ఉండకుండ ధారాళముగ నీటితో పుక్కిలించుట, దంతముల పాఁచి పూర్తిగ తొలగిపోవుటకు కుంచెవలె నమలిన దంతకాష్టముతో తోముట విధిగ చేయునాచారము అలవఱచుకొనవలయును. దంతముల కంటియుండు సున్నితమగు చర్మము సురిఁగిపోకుండులాగున వానిని తోముకొనునపుడు క్రిందనుండి పైకి తోయవలెను. ప్రక్కవాటున ఎన్నడును తోమినతరువాత కూడ పండ్లసందున ఇంక నేమైన చిక్కియున్నట్లుండెనేని ఒక చెంబుడు నీళ్లలో ఒక టీస్పూను (చెమ్చాడు) బై కార్బొనేటు ఆఫ్ సోదాను వైచి ఆ నీళ్లతో పుక్కిళించి ఉమియవలయును. ఈ విధుల సనుసరించుచో దంతములు తెలుపెక్కి తేటు దేజి ఆరోగ్యవర్ధకములగుటకు తోడు కొత్తలావణ్యమును కొనితేగలవు. మందహాసము చేసినపుడు వెలికి బాఱు దంతములు మర్బ మరబియ్యపుగింజలవలె ధవళధవళములై యుండుచో నదనవికాసము చేసి ఎంతటి అందమును గొనితెచ్చునో అనిర్వాచ్యముగదా !
No comments:
Post a Comment