Adsense

Monday, November 11, 2024

దానము అంటే ఏమిటి? ఎన్ని రకాలు -ఫలితం


దయతో ఇచ్చేది దానము. దీన్ని ఇంగ్లిష్ లో డొనేషన్‌ అంటాము. దానము అనేది అవతలి వారు అడినది వారికి ఉపయోగపడేది ఇచ్చే వస్తువు .
మనకి పనికిరాని పుస్తకాలు , దుస్తులు , మెడిసిన్స్ , ఆహారపదార్దాలు డొనేట్ చేస్తూ ఉంటాము .
మన ఆత్యాద్మిక శాస్తాలలో చెప్పిన దానము వేరు ...నీకు పనికి రానిది ఇవ్వవడం దానము కాదు .
అవతలవ్యక్తికి పనికివచ్చే వస్తువునే దానము చేయాలి . . అదే నిజమైన దానము ఫలితముంటుంది . దానము అందుకునే వారు దీవించే దీవెనలే గృహస్తులకు మేలుచేస్తాయి. దానము చే్స్తే పుణ్యము వస్తుందంటారు.!!

దానాని సంబంధిత పదాలు :- 

1. వస్త్రదానము.
2. అన్నదానము.
3. భూదానము.
4. విద్యాదానము.
5. గుప్తదానము.
6. కన్యాదానము.
7.సాలగ్రామ దానము .
8.హిరణ్య దానము

దశవిధ దానములు :-

1.స్వర్ణ దానము,
2.రజిత దానము,
3.గో దానము,
4.అన్న దానము,
5.వస్త్ర దానము
6.విద్యాదానము
7.రక్త దానము,
8.భూ దానము ,
9.గుప్త దానము ,
10.కన్యా దానము.

దానాలు చేయడం వలన కలిగే ఫలితం:
1. బియ్యాన్ని దానం చేస్తే………పాపాలు తొలగుతాయి.
2. వెండిని దానం చేస్తే……….. మనశ్శాంతి కలుగుతుంది.
3. బంగారుని దానం చేస్తే………దోషాలు తొలగుతాయి.
4.పండ్లను దానంచేస్తే…………బుద్ధి,సిద్ధి కలుగుతాయి.
5. పెరుగును దానం చేస్తే…….ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది..
6. నెయ్యి దానం చేస్తే………రోగాలు పోతాయి…..ఆరోగ్యంగా ఉంటారు…
7. పాలు దానం చేస్తే……….నిద్రలేమి ఉండదు.
8. తేనెను దానం చేస్తే….. సంతానం కలుగుతుంది.
9.ఉసిరికాయలు దానం చేస్తే…… మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది..
10. టెంకాయ దానం చేస్తే……… అనుకున్న కార్యం సిద్ధిస్తుంది..
11. దీపాలు దానం చేస్తే........కంటిచూపు మెరుగుపడుతుంది...
12.గోదానం చేస్తే.......ఋణ విముక్తులౌతారు…. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే..... .బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది. ఈశ్వరలోక దర్శనం కలుగుతుంది
14. వస్త్ర దానం చేస్తే………..ఆయుషు పెరుగుతుంది.
15. అన్నదానం చేస్తే..పేదరికం తొలగిపోయి …ధనవృద్ధి కలుగుతుంది.

No comments: