స్వామి వారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాలిని పిలిచి, శ్రీకార్యం సభ్యునితో ఆవిడకు కుంకుమ ప్రసాదం ఇవ్వమని చెప్పారు. ఆమె నిశ్చేష్టురాలై ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది.
ఎందుకంటే ఆవిడ యుద్ధంలో వీర మరణం పొందాడు. ప్రసాదం ఇస్తున్న వ్యక్తి ఆ భక్తురాలితో స్వామి వారు ప్రసాదం ఇస్తే నిరాకరించరాదని.
వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వరని, అందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని చెప్పాడు.
ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్న సాటి భక్తులకు ఈ విషయం చెప్పింది. వారు ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరే సమయానికి భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి ఒక టెలిగ్రాము వచ్చింది. "నీ భర్త యుద్దంలో చనిపొయినట్లు పొరపాటున వార్త అందించాము. అది అబద్ధం. అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు” అన్నది దాని సారాంశం. ఈ వార్త చదవగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పడానికే పరమాచార్య స్వామి కుంకుమ ప్రసాదం ఇచ్చారని అర్థమయ్యి భక్తి పారవశ్యంతో కన్నీరు పెట్టుకుంది.
ఎంతటి పరమాచార్య స్వామివారు. ప్రతి ఒక్కరి గురించిన ప్త్రతి ఒక్క విషయము స్వామివారికి అవగతమే. ఈశ్వరావతారమైన పరమాచార్య స్వామిని పరి పరి విధాల కీర్తించింది.
ఆమె ఆనందం, అతిశయం ఇంతని వర్ణించలేము.
ఆమె భర్త ఇంటికి వచ్చాక, భార్యాభర్తలు ఇరువురూ కంచికి వెళ్ళి, స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. బదులుగా అక్కడ ఉన్న ఆ నడిచే దేవుని పాద పద్మాలను తమ కన్నీరుతో కడిగారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।..

No comments:
Post a Comment