Adsense

Tuesday, December 24, 2024

అల్లం టీ చేయడంలో 90 శాతం మంది చేస్తున్న తప్పులు ఇవే.. పర్ఫెక్ట్‌గా చేసి తాగితే ఈ సమస్యలన్నీ దూరం

పాలతో తయారుచేసిన అల్లంటీని చాలా మంది ఇష్టంగా తాగుతారు. దీని వల్ల ఎంత రీఫ్రెషింగ్‌గా ఉంటుందో అన్నీ లాభాలు కూడా ఉంటాయి. అందుకోసం టీని పర్ఫెక్ట్‌గా ఎలా తయారుచేయాలి.. ఎప్పుడు తాగితే ఎక్కువ లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

సీజన్‌తో సంబంధం లేకుండా అందరూ టీని ఎంజాయ్ చేస్తారు. ఇక వింటర్‌లాంటి చిల్లీ సీజన్‌లో టీని ఒకటికి రెండు సార్లు తాగుతారు. ఇందులో అల్లం వేసుకుని తాగడానికి ఇష్టపడతారు. అల్లంని టీలో వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. నార్మల్ టీ కంటే అల్లం టీనే చాలా మంది ఇష్టపడతారు కూడా.

అల్లం టీ చేయడంలో 90 శాతం మంది చేస్తున్న తప్పులు ఇవే.. పర్ఫెక్ట్‌గా చేసి తాగితే ఈ సమస్యలన్నీ దూరం

నార్మల్‌గా రోజుకి రెండుసార్లు టీ తాగేవారు చలిలో దానిని డబుల్ పరిమణంలో తీసుకుంటారు. ఇక ఎవరైనా బంధువులు వచ్చారంటే ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. టీని కాస్తా ఎక్స్‌ట్రా ఫ్లేవర్‌ఫుల్‌గా చేయాలంటే అల్లంని యాడ్ చేయాలి. దీనిని తాగడం వల్ల ఎంత హ్యాపీగా ఉంటారో.. సీజన్ వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటివి కూడా తగ్గి అంత రిలాక్స్ అవుతారు. అయితే, ఈ టీని తయారుచేసేటప్పుడు ఎప్పుడు అల్లం వేయాలో చాలా మందికి తెలియదు. 100 లో 90 మంది తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకోసమే.. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కోసం టీలో అల్లం ఎప్పుడు వేయాలో తెలుసుకోండి.

టీ తయారు చేయడం..

టీ పెట్టడం వచ్చా అని చాలా మంది అడుగుతారు. అదేముంది ఈజీగా పెట్టగలను అంటారు. కానీ, టీ పెట్టడంలోనూ కొన్ని కిటుకులు తెలిసి ఉండాలండి. నార్మల్ టీని ఎలా అయినా పెట్టొచ్చు. కానీ, పెర్ఫెక్ట్ టీ పెట్టాలంటే ఎప్పుడు ఏం వేయాలి. ఎంత వేయాలనే విషయాలు తెలిసి ఉండాలి. ముందుగా పాలు వేడి చేసి టీ పౌడర్ వేయాలి. తర్వాత పంచదార వేయాలి. తర్వాతే అల్లం వేయాలి. అయితే, అల్లాన్ని అలానే వేయకూడదు.

అల్లం తురుము..

టీ రుచి పెంచడానికి, హెల్త్ బెనిఫిట్స్ కోసం అల్లంలోని సారమంతా టీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే అల్లాన్ని ముందుగా సన్నగా తురుము కోవాలి. పంచదార వేసి మరిగే టీలో ఈ అల్లం తురుము వేసి ఓ 5 నిమిషాలు మరిగించాలి. అప్పుడు టీ రుచి వాసన, రంగు తేడా రావడం మీరు గమనిస్తారు. ఇప్పుడు టీ పర్ఫెక్ట్ రెడీ అయినట్లు.

ఎప్పుడు తాగాలి..

ఈ టీని ఎప్పుడు తాగాలనే అనుమానం కూడా చాలా మందికే ఉంటుంది.
ఉదయాన్నే..
ఉదయాన్నే ఈ అల్లం వేసిన టీని తాగడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది.
భోజనం తర్వాత..
​భోజనం తర్వాత ఈ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు రావు.
నిద్రకి ముందు..
పడుకునే ముందు అల్లం టీ తాగితే డైజేషన్ బాగుండి గట్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు నొప్పులు తగ్గుతాయి. హ్యాపీగా నిద్రపోతారు.

లాభాలు..

ఈ టీ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
అలసట తగ్గుతుంది.
స్టమక్ ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రిలాక్స్ అయి స్ట్రెస్ తగ్గుతుంది. దగ్గు, జలుబు తగ్గుతుంది. గొంతు నొప్పులు తగ్గుతాయి. నోటి దుర్వాసన దూరమవుతుంది.

ఎవరు తాగకూడదు..

ఈ టీని కొంతమంది తాగకపోవడమే మంచిది.ప్రెగ్నెంట్స్, పాలిచ్చే తల్లులు ఎక్కువగా తాగొద్దు.గుండె సమస్యలున్నవారు కూడా తగ్గించాలి.డయాబెటిస్ ఉన్నవారు లిమిటెడ్‌గా తీసుకోవాలి.బ్లీడింగ్ డిసార్డర్ ప్రాబ్లమ్ ఉన్నవారు తగ్గించాలి.

No comments: