టూటీ ఫ్రూటీ అంటే మీరు చెప్పేది ఇదే అనుకొంటాను
మొదట్లో పాపయ పండును మాగిన కొద్దిగా కచ్చిగా ఉన్న వాటిని హీట్ ప్రాసెస్ లో షుగర్ సిరప్ కావలిసిన ఫ్లేవర్, ఫుడ్ కలర్ తో కలిపి ఉడికిస్తారు. అది లిక్విడ్ స్టేజి నుండి చల్లగయ్యాక గట్టిపడుతుంది. దాన్ని కావలిసిన సైజు లో కట్ చేస్తారు.
ఇంట్లో చేసినదానికి చిన్న కుటీర పరిశ్రమల్లో చేసినవాటికీ ఓ రకమైన ఆడ్ స్మెల్ మరి జిగట ఉంటుంది.
ఇండియా లోని అతి పెద్ద ఫ్యాక్టరీ నిలోన్స్ కంపెనీ జలగాం, మహారాష్ట్ర లో ఉంది.
మన దేశంలోని అత్యంత టూటీ ఫ్రూటీ వాడే సంస్థ హైదరాబాద్ లోని కరాచీ బేకరీ.
ప్రస్తుతం వైటనింగ్ క్రీం ల యొక్క డిమాండ్ ను బట్టి పపయ కాయగా ఉన్నపుడే చెట్టుమీదే దానికి గాటు పెట్టి దాన్నుంచి వచ్చే పాపాయన్ అనే ఎంజైమ్ పాల రూపం లో తీయబడుతుంది. ఆ పాలలాంటి పదార్థం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి వైటనింగ్ క్రీం లో వాడతారు.
ఆలా ఆ ఎంజైమ్ తీసెయ్యబడ్డ పపాయలను ప్రస్తుతం ట్యూటీ ఫ్రూటీ చేయడానికి వాడుతున్నారు.
(సేకరణ )
No comments:
Post a Comment