సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99% మంది చెప్పలేకపోయారు... మీరు ట్రై చేస్తారా..?
చల్లని సాయంత్రం వేడివేడిగా ఏదయినా తింటుంటే ఆ మజాయే వేరు... ఈ తినేది రుచికరమైన సమోసా అయితే ఆ అనుభూతి వేరే లెవెల్. భారతీయుల స్నాక్స్ లిస్ట్ సమోసాతోనే ప్రారంభం అవుతుందని అనడంలో సందేహం లేదు... అలాంటి సమోసాను ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు తెలుసా..?
Samosa
చాలామందికి సాయంత్రం వేళ చిరుతిళ్లు (స్నాక్స్) తినే అలవాటు వుంటుంది. ఒక కప్పు టీతో పాటు ఏదోఒకటి లేకుంటే ఆ సాయంత్రం గడవదు. ఇలా ఎక్కువమంది ఇండియన్స్ తీసుకునే స్నాక్స్ ఏదో తెలుసా... సమోసా. చల్లని వేళ వేడివేడి సమోాసాలను తినడాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి.
ఫుడ్ లవర్స్ సమోసా అంటే పడిచస్తుంటారు. భోజనం చేయకున్నా సమోసాతో కడుపు నింపుకునేవారు చాలామంది వుంటారు. అందువల్లే సమోసాను స్నాక్స్ లో రారాజుగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు.
భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా సమోసాలు దొరకుతాయి. తయారుచేసే పద్దతిలో, రుచిలో తేడా వుండొచ్చు... కానీ ప్రతిచోటా దానిపేరు సమోసానే. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ... అన్ని బాషల్లోనూ సమోసానే.
కేవలం మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో సమోసాలు లభిస్తాయి. ఆ దేశాల్లోనూ రుచికరమైన ఆహారంగా గుర్తింపుపొందింది, దీంతో విదేశాల్లోని భారతీయులు సమోసా రుచిని మర్చిపోవడంలేదు. అంటే సమోసా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్నాక్స్.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది సమోసా భారతీయ వంటకం అనుకుంటారు. కానీ సమోసా ఇరానియన్ వంటకం. అక్కడ సమోసాను సాంబోసా అని పిలుస్తారు. మొఘలుల ద్వారా ఈ ఆహారం భారతదేశానికి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం సమోసాలో బంగాళాదుంపలతో పాటు పల్లీలు కనిపిస్తాయి. గతంలో సమోసాలో మాంసం కీమా నింపేవారు. కాలక్రమేణ తయారీ విధానంలో మాార్పులు జరిగాయి.
రుచికరమైన ఆహారంగా సమోసా ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, ఈ సమోసా కోసం మొత్తం రోజునే కేటాయించారంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ప్రపంచ సమోసా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
- భారతీయ బాషలన్నింటిలో సమోసా అని పిలువబడే అందరికీ ఇష్టమైన ఆహారాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన ఆహారం సమోసాను ఆంగ్లంలో రిస్సోల్ అని పిలుస్తారు.
No comments:
Post a Comment