గారెలు అంటేనే కమ్మటి వాసన గుబాళిస్తుంది.
అందుకే తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి. అంటారు.
ఇంటికి అల్లుడు వచ్చాడంటే గారెలు ,కోడి కూర సిద్ధం చేస్తారు. గోదావరి జిల్లాలలో …
నాన్ వెజ్ తినని వాళ్ళకి అల్లం పచ్చడి బాగుంటుంది. కొబ్బరి చట్నీ కూడా చాలా మంది ఇష్ట పడతారు.
టమాటా, క్రోత్తిమెర పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది.
కాలిఫ్లవర్, బంగాళాదుంప మసాలా కూర కూడా బాగుంటుంది గారెలు తో.
చింతామణి చట్నీ గోదావరి జిల్లాల్లో ఫేమస్. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర నూరి ,శెనగపిండి తో చేస్తారు. సాంబారు హోటల్స్ లో చట్నీ తో పాటు ఇవ్వడం మామూలే.
ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి కూడా గారెలు వేసుకుంటారు. ఇవి వేసుకుంటే కొంచెం వరి పిండి కలిపితే బాగుంటాయి.
ఇక అమ్మవారి నైవేద్యం గా అల్లం జీలకర్ర రుబ్బి గారెలు తయారు చేస్తారు.
కోన సీమ లో కొబ్బరి తురుమును కలిపి గారెలు వేస్తారు.
తిరుపతి ప్రసాదం గారెలు పొట్టు మినప్పప్పు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర వేసి, బరక గా పప్పు పప్పు గా రుబ్బి, గారెలు వేస్తారు.
పాకం గారెలు…స్వీట్స్ ఇష్టం అయిన వారికి చాలా నచ్చుతాయి. బెల్లం లేత పాకం పట్టి, వేడి వేడి గారెలు వేస్తే , చక్కగా నాని తిండానికి బాగుంటాయి.
ముదురు పాకం అయితే వారం రోజులు నిలువ ఉంటాయి.
బెల్లం వండే చోట పాకం వుంటుంది. అది తెచ్చి ఫ్రిడ్జ్ లో వుంచుకుని , గారెల్లో వేసుకుని తినొచ్చు.
No comments:
Post a Comment