Adsense

Saturday, January 18, 2025

ఆరోగ్యం మరియు ఆయుష్షుని పెంచే అవిసె గింజలు

ఆరోగ్యం మరియు ఆయుష్షుని పెంచే అవిసె గింజలు

👉అవిసె గింజలను తినడానికి ఉత్తమమైన మార్గం మొలకలు.

👉నానబెట్టి మొలకెత్తించిన అవిసె గింజలను తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు.

👉వీటిని పొడిచేసి తీసుకోవడం మంచిది.

👉వీటిని తినేటప్పుడు చాలా ఎక్కువ నీరు తాగటం మర్చిపోవద్దు.

👉అవిసె గింజల నూనెను వేడి చేయరాదు. వేడి చేస్తే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి.

👉కానీ అవిసె గింజలను హాయిగా వేయించుకొని తినవచ్చు.

👉వీటిని ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

👉అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు.

👉వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది.

👉 దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.

👉అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

👉వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను తగ్గించడానికి సహాయపడుతుంది.

👉 అవిసె గింజలలో గల పీచుపదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర బరువును తగ్గిస్తుంది.

👉వీటిలో అధిక స్థాయిలో మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ ఉంటుంది.

👉ఈ రకమైన పీచు పదార్ధం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది.

👉దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది.

👉ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది.

👉అధిక రక్తపోటు తగ్గించడానికి ఈ అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి.

👉అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన మధుమేహంతో బాధపడే వ్యక్తుల ఆరోగ్యం నిదానంగా మెరుగుపడుతుంది.

👉20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

👉మరీ ముఖ్యంగా ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది.

👉అవిసె గింజలు జలుబు, దగ్గులను నివారించడానికి కూడా అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడతాయి.

👉 2-3 చెంచాల అవిసె గింజలను ఒక కప్పు నీటిలో నీరు బాగా చిక్కగా అయ్యేవరకు ఉడికించి వడకట్టిన చిక్కని నీటికి 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకోవాలి.

👉 అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయి.

👉అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుంది.

👉అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

👉అవిసె గింజలలో గల ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ లను తగ్గించడానికి ఉపయోగ పడతాయి

👉వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చు.

👉గర్భధారణ సమయంలో అవిసెగింజలను తీసుకోవడం వల్ల ఆ సమయంలో కలిగే మలబద్దకాన్ని పోగొట్టవచ్చు.

👉 ఈ గింజలలో ఉండే పోషకాలు గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. కానీ డాక్టర్ల సలహాతో తీసుకోవడం మంచిది.

👉అవిసె గింజలను తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

👉అంతేకాక ప్రోస్టేట్ కాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి కొన్ని కాన్సర్ ల నుండి కూడా కాపాడగలదు.

👉 ఫంగల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, గొంతునొప్పి, చెవినొప్పి, పన్ను నొప్పి, ఆస్తమా తగ్గించటానికి ఉపయోగపడతాయి.

👉అవిసె గింజలను ప్రతీ రోజూ ఆహారంలో భాగంగా చేయడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

👉అవిసె గింజల్లోని పీచు పదార్ధాలు జీర్ణాశయం పనితీరును మెరుగుపరచి గ్యా స్ట్రిక్ సమస్యలను త్తగ్గించడంలో సహాయపడతాయి.

👉అవిసె గింజల పొడిని ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మలబద్దకం కూడా తగ్గుతుంది.

👉అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి.

👉 అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి.

👉కాలుష్య కారకాలు మీ చర్మ రంధ్రాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.

👉 చర్మం పై ముడతలు పోతాయి. చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారడాన్ని నిరోధించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

👉అవిసె గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్ధం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి.

👉ప్రతీ రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తీసుకోవడం ద్వారా మొటిమలను అరికట్టవచ్చు.

👉పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులు అవిసె గింజల ద్వారా నిరోధించబడతాయి.

👉ఒక టీస్పూన్ అవిసె గింజల నూనెకు రెండు టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి ముఖంపై రోజూ ఉదయాన్నే ఫేస్ ప్యాక్ లాగా వేయాలి.

👉దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది. చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి.

👉అవిసె గింజలలో ప్రోటీన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఇనుము మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలూ ఉంటాయి.

👉అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.

👉ఏదైనా తగు మోతాదులో తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోకూడదు.

No comments: