Adsense

Wednesday, February 12, 2025

తండేల్ పదానికి అర్థం ఏమిటీ?

తండేలు ఒక అచ్చతెలుఁగుమాట. కెప్టెన్ అని అర్థం. ఇది మిగితా తెలుఁగు ప్రాంతాల్లో మఱువఁబడి కోస్తాలోనే మిగిలింది.

తండ = team (తండ్రిలో ఉన్నది కూడా తండయే. తండ + అరి = తండరి)

ఏలు (ఏలేవాఁడు) = head

పారేలు (భూస్వామి), పడేలు (సేనాధిపతి) మొదలైన మాటల్లో కూడా మనం ఈ ఎసకట్టు (నిర్మాణాన్ని) గమనింౘవచ్చు.

_______________


ఇహపోతే తండేలు అరబ్బీ అనో ఫారసీ అనో పోర్చుగీస్ అనో చెప్పే పులిహోర కబుర్లు నమ్మకండి. కాకతీయుల, విజయనగర రాజుల ఏల్బడికాలంలో చాలా తెలుఁగు మాటల్ని తీసుకెళ్ళి సంస్కృతంలో కలిపేసారు. అలాగే మనల్ని ఏలిన నవాబుల కాలంలో పలు తెలుఁగుమాటలు ఉర్దూలోకి వెళ్ళి అక్కణ్ణుంచి మిగితా ఇస్లామిక భాషలకూ, ఉత్తరాది భాషలకూ ప్రాఁకాయి.

_______________

No comments: