తిప్పతీగను ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనినే గిలాయ్ అంటుంటారు. ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఈ తిప్పతీగను క్యాప్సుల్స్ రూపంలో లేదా జ్యూస్,పౌడర్ రూపంలో కూడా ఉపయోగిస్తుంటారు. దీనిని సర్వరోగనివారిణి అని కూడా అంటుంటారు.
ఈ తీగ వల్ల లాభాలు ఏంటంటే..
- బరువు తగ్గడం
తిప్పతీగలో జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైపోలిపిడెమిక్ చర్యలు ఈ తీగలో కలిగి ఉండటం వలన ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
- శ్వాస సమస్యలు
ఈ తిప్పతీగను దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక దగ్గు, ఉబ్బసం సమస్యల పై ఇది మంచి ప్రభావం చూపుతుంది.
- డయాబెటిస్
మధుమేహం నియంత్రణలో కూడా ఈ తిప్పతీగను ఉపయోగిస్తారు. ఈ తీగ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్లుకోస్ స్థాయిలు తగ్గుతాయి.
- జ్వరం
తిప్పతీగలో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక లక్షణాలు కూడా ఉండటం వల్ల ఇది జ్వరాల నుండి, ఇంఫేక్షన్స్ నుండి రక్షిస్తుంది.
- మానసిక ఆరోగ్యం
తిప్పతీగను డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తుంటారు.
- క్యాన్సర్
తిప్పతీగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో కూడా ఇది మంచి ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment