Adsense

Wednesday, March 19, 2025

అరటిఆకులో భోజనం ఆరోగ్యానికి మంచిదంటారు, ఎందుకు?

అరటి ఆకు ముందు భోజనం మిక్కిలి పరిశుభ్రమైనదిగా, శ్రేష్టమైనదిగా ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది.

  1. అరటి ఆకులో భోజనం కఫము వాతములను హరిస్తుంది.
  2. బలమును, ఆరోగ్యమును ఎక్కువగా చేయను.
  3. శరీర కాంతిని పెంపొందిస్తుంది.
  4. ఆకలి దానితోపాటు, దంతములు యొక్క కాంతిని పెంపొందిస్తుంది.
  5. పైత్యంను శాంతింప చేస్తుంది.
  6. శ్లేష్మ వికార్లని, బాడీపెయిన్స్ ను తొలగిస్తుంది.
  7. క్రిమినాశకారి అని అంటారు.

అరిటాకులు అనేక వైద్య గుణాలు దొరుకుతాయని పెద్దలు తెలియజేసినారు. సామాన్యంగా అరటి ఆకును తాజాగా ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. సామాన్యంగా పచ్చని ఆకులలో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది ఈ పదార్థము మానవుని ఆరోగ్యమునకు చాలా అవసరమైనది ఆకుపచ్చని అరటి ఆకులు భోజనం చేయడం వల్ల ఆకుపచ్చని పదార్థము ఆహారమునకు చేరి దేహా ఆరోగ్యమునకు సహాయకారిగా ఉండును. ఇంకా పేగులలో ఉన్న కెమికల్ నాశనం చేయను.

(స్నానము, భోజనము, తాంబూలం అనే పుస్తకంలోని సంగ్రహించడం జరిగినది) పోటో (గూగుల్ సౌజన్యం)

No comments: