ప్రతి ఒక్కరూ తమ డ్రీం లైఫ్ గడపాలని కోరుకుంటారు, కానీ ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని సాధించలేరు. మీ ఇన్కమ్ ని పెంచుకోవటానికి మీరు ఎంత ఎక్కువ సమయం మరియు కృషిని వెచ్చిస్తే, మీరు కోరుకున్న జీవితాన్ని గడపడానికి మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించే అవకాశాలు ఎక్కువ. మీరు మీ సమయం మరియు వ్యక్తిగత అభివృద్ధిలో మరింత స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు. మీరు ప్రతి నెలా ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరుల నుండి రాబడిని పొందుతూ ఫైనాన్సియల్ ఇండిపెండెన్స్ సాధించాలని మరియు ప్రపంచాన్ని పర్యటించాలని కోరుకుంటే, మీరు ఆ లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు విజయం యొక్క మూల్యాన్ని చెల్లించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని గుర్తుంచుకోండి.
ఇప్పుడు వున్న ఇంటర్నెట్ ప్రపంచం లో ఎక్కువ మంది సోషల్ మీడియా డిస్ట్రక్షన్స్ లో మునిగిపోయి సెకండరీ ఇన్కమ్ ఆలా ఉంచండి. ప్రైమరీ ఇన్కమ్ కి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఇక్కడ మనం రెండో ఇన్కమ్ తీసుకోవాలి అంటే సోషల్ మీడియా ని ఇంటర్నెట్ ని మనం వాడుకోవాలి తప్ప డిస్ట్రక్ట్ అవ్వకూడదు.
నా గురించి చెప్పాలి అంటే నేను ఇప్పుడు నేను చేసే హోమ్ బేస్డ్ బిజినెస్ నుండి కేంద్రం గా చేసుకొని వివిధ రకాలు గా డిజిటల్ బిజినెస్ మోడల్ లో పొందుతున్నాను.
రెండో ఆదాయం మొదలు పెట్టాలి అంటే మనం ఇప్పుడు ఏదైనా జాబ్ లేదా బిజినెస్ చేస్తుంటే ఇంకో వుద్యోగం లేదా వ్యాపారం మొదలు పెట్టవచ్చు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే టైం . మనం టైం పెట్టటం చాల ముఖ్యం.
నేను నా ప్రైమరీ బిజినెస్ దాదాపు 25 సంవత్సరాల నుండి ఒక బిజినెస్ సెంటర్ కాలేజీ రోడ్ లో నడుపుతున్నాను. నాకు వున్నా కొన్ని ఆరోగ్య సమస్య ల వలన నాకు బాగా తెలిసిన ఒక మిత్రుని ద్వారా ఒక రెండో ఆదాయ అవకాశం నాకు పరిచయం అయింది. ముందు నాకు వున్నా సమస్య కి కొన్ని ప్రొడక్ట్స్ వాడటం వలన మాత్రమే తరువాత ఆ ప్రొడక్ట్స్ ని కొంతమందికి పరిచయం చేయటం ద్వారా పార్ట్ టైం గా కొంత ఇన్కమ్ పొందటం మొదలు పెట్టాను.
మీరు కూడా ఏదైనా సరే వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ముందు చేసే జాబ్ లేదా బిజినెస్ వాడాలి ప్రయత్నించవద్దు. అది చేస్తూనే పార్ట్ టైం లో మొదలు పెట్టండి. ఎందుకు అంటే ఒకవేళ రెండో బిజినెస్ సరిగా లేకపోతే ఇబ్బంది పడతారు.
అయితే ఎప్పుడు అయితే PANDEMIC వచ్చిందో నా మొదటి బిజినెస్ నుండి అసలు ఆదాయం రావటం ఆగిపోయింది. ఒక్కసారి నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. రెండో బిజినెస్ కూడా పూర్తి గా ఆగి పోయింది. అప్పుడు నాకు వున్నా 4 క్రెడిట్ కార్డ్స్ నుండి రొటేషన్ పద్దతి లో వాడుకుంటూ కొద్దీ రోజులు గడిపాను. ఎందుకు అంటే మేము అప్పటివరకు హోటల్ మీటింగ్స్ లేదా హోమ్ మీటింగ్స్ ద్వారా వ్యాపారం వేరే వాళ్ళకి పరిచయం చేయటం అలవాటు వుంది. PANDEMIC వలన ఆ అవకాశం లేకుండా పోయింది. అప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎలా వ్యాపారం చేయాలి అనేది నేర్చుకున్నాను.
Magic ఎక్కడ జరిగింది అంటే సోషల్ మీడియా లో మొదలు పెట్టిన తరువాత ప్రతిరోజు చాలామందికి నా వ్యాపారం లేదా ప్రొడక్ట్స్ వాళ్ళ అవసరం గుర్తించి పరిచయం చేయటం మొదలు పెట్టాను. ఒక 6 నెలల్లో మంచి ఆదాయం తీసుకోవటం జరిగింది.
ఇప్పుడు నేను ఎలా సోషల్ మీడియా లో వ్యాపారం చేసానో కొంత మందికి నాలాగా ఇబ్బంది పడుతున్న వారికీ TRAINING ఇచ్చే ఒక సిస్టం ని నిర్మించాను. అలా ఇంకో ఆదాయ వనరుని ఏర్పాటు చేసుకున్నాను.
సోషల్ మీడియా లో బిజినెస్ చేయాలి అంటే కొన్ని టూల్స్ కావాలి . కొంతమంది మీరు ఏమి టూల్స్ వాడుతున్నారు అని అడిగినప్పుడు వాటిని వాళ్ళకి suggest చేయటం ద్వారా Affiliate మార్కెటింగ్ కూడా మొదలు పెట్టాను.
నేను చేసే వ్యాపారం గురించి బ్లాగ్ మరియు నా సొంత వెబ్సైటు (3) నేనే స్వయంగా నిర్మించుకున్నాను. 1. నా పర్సనల్ 2. Kishore Reddy Alla 3. Software system ని recommend చేయటానికి. అయితే ఈ ప్రాసెస్ లో నాకు వచ్చిన ఆదాయం నుండి నేను కొంత భాగం నేర్చుకోవటానికి కేటాయించ వలసి వచ్చింది. కొన్ని కోర్సెస్ లో జాయిన్ అయ్యాను. Intermediate మాత్రమే చదివి నెలకి 1 crore పైగా ఆదాయం తీసుకుంటున్న SIDDHARTH RAJSEKAR దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. Systems & Tribes ఎలా నిర్మించాలి అని.
నేను ఏదైతే కోర్స్ లేదా కమ్యూనిటీ లో చేరానో అక్కడనుండి నేర్చుకున్నానో ఆ కమ్యూనిటీ ని కొంతమంది కి explain చేయటం మరియు వాళ్ళకి అవసరం ఉంటే నేను పరిచయం చేయటం ద్వారా కొంత ఆదాయం వస్తుంది.
నేను ఏదైతే ఇప్పుడు నా బిజినెస్ ఆటోమేషన్ చేయటానికి వాడే system ని కొంతమంది కి పరిచయం చేయటం ద్వారా కొంత ఆదాయం వస్తుంది.
నా 4 సంవత్సరాల ప్రయాణం లో నేను నేర్చుకున్న విషయాలని, వివిధ కోర్సెస్ రూపం లో చేసి కొత్త గా ఎవరు అయితే వ్యాపారం మొదలు పెట్టాలి లేదా అప్పటికే వ్యాపారం లో వున్న వారికీ వారి వ్యాపారం సోషల్ మీడియా లేదా డిజిటల్ టూల్స్ వాడటం ద్వారా ఎలా వ్యాపార వృద్ధి చేసుకోవచ్చో నేర్పటం ద్వారా ఇంకో ఆదాయ వనరు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం లో వున్నాను. ఎందుకు అంటే అన్ని విషయాలు మన స్వంతంగా నేర్చుకుని ఎక్కువ సమయం వృధా చేసుకోవటం అనేది ఇప్పుడు నా విషయం లో జరిగింది. అందరికి ఆలా సమయం మరియు ఎక్కువ డబ్బులు వృధా కాకుండా ఒక సిస్టమాటిక్ పద్దతి లో నేర్పటం నా ముందున్న ముఖ్యమైన లక్ష్యం.
బిజినెస్ లో కొన్ని ప్రాసెస్ లు ఆటోమేట్ చేయటం, మరియు సోషల్ మీడియా లో మన presence ఉండటం ఇప్పుడు వున్న Internet ప్రపంచం లో తప్పనిసరి. ఎందుకు అంటే డబ్బులు, సమయం ఆదా అవుతాయి. కస్టమర్ satisfaction కూడా ఎక్కువ ఉంటుంది. ex : ఎవరైనా కస్టమర్ కొత్త contact అయ్యినప్పుడు మన వ్యాపారం గురించి వివరాలు వాళ్ళకి తెలిసే విధంగా మరియు వాళ్ళని follow-up చేయటానికి కొన్ని టూల్స్ ఉంటే బాగుంటుంది.
ఇప్పుడు నేను నా ముందు బిజినెస్ ని పూర్తిగా పక్కన పెట్టి ఈ కొత్త బిజినెస్ ని నా ముఖ్యమైన ఆదాయ వనరు గా చేసుకున్నాను. ఎక్కువ మందికి వారి వ్యాపారం నిర్మించుకోవడానికి మరియు మొదలు పెట్టటానికి సహాయం చేస్తున్నాను. నేను నాకు ఇష్టమైన పని చేయటం ద్వారా FREEDOM LIFE ని ENJOY చేస్తున్నాను.
వ్యాపారం మొదలు పెట్టటం మరియు విజయం సాధించాలి అంటే అలా జరిగి పోదు. నిరంతరం మన కృషి, పట్టుదల ఉండాలి. మంచి mentors ని కూడా ఎంచుకోవాలి.
No comments:
Post a Comment