*పూర్వం కొంతమంది ఋషులు వ్యాస భగవానుడు వద్దకు వెళ్లి, ”ఓ! మహర్షీ! సర్వజ్ఞుడవు. నీకు తెలియని విషయం ఉండదు కదా! మాకొక సందేహం వచ్చి వివరణ కొరకు మీ వద్ధకు వచ్చాము. మానవుడికి సహాయంగా ఉండేది తల్లిదండ్రులా? తాతానాయనమ్మలా? సంతానమా? లేక గురువా? స్నేహతులా? బంధువులా? వీరిలో ఎవరు? మనిషి మరణించగానే జీవంలేని కట్టెను ఎవ్వరూ పట్టించుకోరు.*

*అంతా ఋణానుబంధం అని కొద్దిరోజులు విచారించి, జన స్రవంతిలో మామూలుగా తిరుగుతూ ఉంటారు. మరి వారి వెంట వెళ్ళేది పాప-పుణ్యాలంటారు. ఈ విషయంపై వివరించండి!” అని కోరారు.*
*వ్యాస మహర్షి ”ఋషివర్యులారా! నరుడు ఒక్కడు గానే జన్మిస్తాడు. ఒక్కడుగానే మరణిస్తాడు. ఎవరి సుఖ- దు:ఖాలు వారే అనుభవిస్తున్నారు. మనిషి ఎప్పటికీ ఏకాకే. నిస్సహాయుడే. అతడు మరణిస్తే బంధువులు అందరూ కొద్ది రోజులు దు:ఖంలో ఉండి విచారిస్తుంటారు. వెంట ఎవ్వరూ రారు* *కదా. వెంట వెళ్ళేది ”ధర్మం” ఒక్కటే. తన జీవిత కాలంలో చేసే పాప- పుణ్యాలు అనుసరించే మార్గం ధర్మమే. మరేదీ మనిషి వెంట వెళ్ళదు. ధర్మం వల్ల తనకు మేలు కలుగుతుందని, మానవుడు సత్కర్మలు చేస్తూ ధర్మ మార్గంలో సంచరించాలి.*
*మనిషిని అంటిపెట్టుకుని ఉన్న కామ క్రోధ, లోభ వంటి అరిషడ్వర్గాలు వల్ల, భయం వల్ల, స్వార్థం వల్ల, ధర్మం తప్పుతూ ఉంటారు. మహాజ్ఞానులు సైతం కొన్ని పరిస్థితుల్లో ధర్మ విరుద్ధమైన కర్మలు చేస్తూంటారు అర్థం, కామం, అనే పురుషార్థాన్ని కూడా ధర్మబద్ధంగా పొందితేనే, మానవుని జీవితం సాఫల్యత చెందుతుంది.” అని వ్యాసుడు చెప్పగా విని మరల ఆ మహర్షులు ”స్వామి శరీరం నాశనం ఎలా అవుతుంది? మానవుడి శరీరం దహనం పూర్తి అయిన తరువాత అతడి ఆత్మ సూక్ష్మ రూపంలో కనిపించకుండా, ఉంటుంది కదా! ధర్మం ఈ సూక్ష్మ రూపాన్ని ఎలా వెంబడిస్తుంది?” అని తిరిగి ప్రశ్నించారు.*
*”ఋషులారా! గృహస్థ ధర్మాన్ని ఆచరించేవారు నిరంతరం ఆచారాలు పాటించాలి. జ్ఞానులు, పెద్దలు చెప్పిన రీతిలో, చూపిన మార్గంలో సంచరించాలి. సత్యం, ధర్మం రెండు కళ్ళుగా నీతితో వ్యవహరించని వారికి ఇహ-పర సౌఖ్యాలు ఉండవు. అల్ఫాయుష్కులు అవుతారు. ముందు తరంవారు అనుసరించకపోతే, తరువాతి తరం వారు అథోగతి పాలవుతారు. వక్ర మార్గంలోనే నడుస్తారు. ప్రతీ గృహస్థుడుకు తన కర్త వ్యంగా ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలను సాధించే దిశగా నడవాలి. ప్రతీరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే, స్నానాదికాలు ముగించుకొని ఇష్ట దైవాన్ని స్తుతించాలి. ఆరాధించాలి. ప్రతీ జీవి పట్ల ఔదార్యంతో ఉంటూ, ఆకలితో అలమటించే వారికి ఆహారం సమకూర్చాలి. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. దేవాలయాల్లో, పంట భూముల్లో, పుణ్య నదులలో, మల మూత్ర విసర్జన చేయకూడదు. అన్నం పరబ్ర హ్మస్వరూపం. కాబట్టి, మంచాల మీద, కుర్చీల మీద, నుంచొని, ఆహారం భుజించకూడదు. గురువులుతో, పెద్దలతో అనుకూలంగా సంభాషించాలి. వ్యర్థ ప్రసంగం చేయకూడదు. ఇతరుల మీద నిందలు మోపి, తగవులు పెట్టడం వంటి దుర్గుణాలు ఉండకూడదు.*
*స్త్రీలను, అంగవైకల్యం వారిని, పెద్దలను, గురువులను నిందించరాదు. దానాలు చేయడం, దైవకార్యాలలో పాల్గొనడం, ప్రజోపయోగమైన కార్యాలు చేయడం, ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.” అంటూ ఇంకా ఎన్నో ధర్మాలు, ఆచారాలు వివరించారు.*
*”మహర్షులారా! మానవులు చేసే ప్రతీ ధర్మ అధర్మ కార్యాలకు పంచభూతాలు సాక్ష్యులుగా ఉంటాయి. జీవుడు మరణించిన తరువాత, చర్మం, మాంసం, ఎముకలు, రక్తం వంటివి అన్నీ ప్రాణంతోనే నశిస్తాయి. ఆత్మ ఒక్కటే అదృశ్య రూపంలో వెడుతుంది. అంతవరకు జీవి చేసుకొన్న పాప- పుణ్యాల ఫలం ధర్మం రూపంలో వెడుతుంది. అధర్మపరుడు అయితే నరకానికి, పుణ్యవంతుడు అయితే పుణ్యలోకాలకు వెడతారు. జీవి ఒక వేళ తప్పు చేసినా, పశ్చాత్తాపం చెందితే కొంతవరకు పుణ్యం లభిస్తుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడూ అదే తప్పు చేయకూడదు.” అంటూ వివరించారు.*
*మానవులు సంసార చక్రంలో చిక్కుకొని, స్వార్థం తో భార్యాపిల్లల ఔన్నత్యం గురించే తాపత్రయ పడు తుంటారు. దీనివల్ల అధర్మంగా ప్రవర్తించవలసి వస్తుంది. అందుకే అనేక సుఖ- దు:ఖాలకు వారంతట వారే కారణభూతులవుతున్నారు. అంతులేని రోగాల పాలవు తున్నారు. అటువంటి సమయంలోనే భగవంతుడు కనపడతాడు. ఆ స్థితిలో పరమాత్మ మాత్రం ఏమి చెయ్యగలడు? తను చేసుకొన్న దుష్కర్మల ప్రభావం అనుభవించక తప్పదు కదా. అందుకే మానవులు సన్మార్గంలో నడవడానికి మీరు అందరూ బాటలు వేయండి.” అని చెప్పి ముగించారు.*
*చూసారా! ఇహపర సౌఖ్యాలు పొందాలంటే మన చేతుల్లోనే ఉందని వ్యాసమహర్షి చెప్పారు. మనం కూడా మన విచక్షణా జ్ఞానంతో మంచి కార్యాలు చేయడానికి సంసిద్ధులమవుదాం.

No comments:
Post a Comment