Adsense

Monday, August 4, 2025

శివ పూజకు పుష్పాలు 🌺



శివార్చనకు గన్నేరు, జిల్లేడు, మన్దారము, జమ్మి, బొగడ, మోదుగ, మథూకము (ఇప్ప), వెంపలి, మారేడు, ఉత్తరేణి, పాటలము, అశోకము, అవిసె, ఉమ్మెత్తి, కొండగోగు, కడిమి, నల్లగోరింట, సురపొన్న, ఎఱ్ఱగోరింట, ఎఱ్ఱదేవకాంచనము, మల్లి, పండుగురివెంద, జాజి, తుమ్మి, సూరురేకుల పద్మము, వెయ్యిరేకుల పద్మము, తెల్ల కలువ, నల్లకలువ, తాపింఛము, తులసి వీనికి సంబంధించిన పుష్పపత్రములు శ్రేష్ఠములు. దీనితో శివుని పూజించిన సమస్త పాపములు నశించుననుట ముమ్మాటికి ప్రమాణభూతము.

మలినములైనవి, శరీరముచే తాకబడినవి, వాసన చూపబడినవి, వికసించనవి, అపవిత్ర పాత్రలో ఉంచబడినవి, కొనితేబడినవి, యాచించి తెచ్చినవి, ఎండినవి, కుళ్ళినవి, నేలమీద పడినవి మునగు పత్రపుష్పములతో శివుని పూజించరాదు. మరియు వికసించని పువ్వులు శివపూజకు మిక్కిలి  అనర్హములు.

గుడ్డలో పోసి తెచ్చినవి, చేతితో తెచ్చినివి, గాలిచే పడిన పత్రపుష్పములు సర్వదా వర్జించవలయును. శివార్చన పనికిరావు. (పారిజాత, పొగడ పువ్వులు మాత్రము గాలిచే క్రిందపడినవి పూజార్హములు)

No comments: